For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు ఇదే.. హైదరాబాద్‌ ఆటగాడికి చోటు!!

U-19 World Cup 2020 : Team India Full Squad For U-19 World Cup 2020 ! || Oneindia Telugu
BCCI announced 15-member squad for U-19 World Cup 2020, Priyam Garg to lead India

ముంబై: దక్షిణాఫ్రికా వేదికగా జరిగే 2020 అండర్‌-19 ప్రపంచకప్‌కు సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ రోజు ఉదయం బీసీసీఐ తన ధికారిక ట్విటర్‌ ఖాతాలో 15 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాకు వెళ్లే 15 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్‌గా ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రియమ్‌ గార్గ్‌ ఎంపికయ్యాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ధ్రువ్‌ చంద్‌ జురెల్‌ భాద్యతలు నిర్వర్తించనున్నాడు. ధ్రువ్‌ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు.

హైదరాబాద్‌ ఆటగాడికి చోటు:

హైదరాబాద్‌ ఆటగాడికి చోటు:

ధ్రువ్‌తో పాటు కుమాల్ కుషాగ్ర కూడా జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మకి చోటు దక్కింది. తిలక్‌ జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. తిలక్‌తో పాటు యశస్వి జైస్వాల్‌, దివ్యాన్ష్‌ సక్సేనా, శషావత్‌ రావత్‌ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు.

గ్రూప్-ఎలో టీమిండియా:

గ్రూప్-ఎలో టీమిండియా:

అండర్‌-19 విభాగంలో ఇది 13వ ప్రపంచకప్‌. ఈ మెగా ఈవెంట్‌ను దక్షిణాఫ్రికాలో రెండోసారి నిర్వహిస్తున్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టీమిండియా గ్రూప్-ఎలో ఉంది. టీమిండియాతో పాటు జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్-ఎలో ఉన్నాయి.

మంచి సమతుల్యం ఉంది:

మంచి సమతుల్యం ఉంది:

2018లో పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ గెలిచింది. అప్పడు అండర్‌-19 జట్టు కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా మన అండర్ -19 జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ ద్రవిడ్ ధీమా వ్యక్తం చేసాడు. జట్టులో మంచి సమతుల్యం ఉంది అని పేర్కొన్నాడు.

భారత జట్టు:

ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ చంద్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, దివ్యాన్ష్‌ సక్సేనా, శషావత్‌ రావత్‌, దివ్యాన్ష్‌ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తిక్‌ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమాల్ కుషాగ్ర, సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌.

Story first published: Monday, December 2, 2019, 11:40 [IST]
Other articles published on Dec 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+