Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. సకారియా, పడిక్కల్‌కు అవకాశం! శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఇదే!

BCCI announce Team India Squad for Sri Lanka Tour, Shikhar Dhawan named captain

ముంబై: శ్రీలంకలో పర్యటించే భారత జట్టును భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్‌ కమిటీ గురువారం ఎంపిక చేసింది. లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్‌ ఓపెనర్ శిఖర్‌ ధావన్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న తరుణంలో.. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనుండడంతో ఈ టీమిండియా-2 కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నది. ఈ టూర్‌కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది.

సకారియా, పడిక్కల్‌కు అవకాశం:

సకారియా, పడిక్కల్‌కు అవకాశం:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌), దేశవాళీ పోటీల్లో సత్తా చాటిన దేవదత్‌ పడిక్కల్‌, నితీష్‌ రాణా, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌కు తొలిసారి భారత జాతీయ జట్టులో అవకాశం దక్కింది. గతంలో జట్టుకు ఎంపికయి ఫిట్‌నెస్‌ కారణంగా తప్పుకున్న.. వరుణ్ చక్రవర్తికి కూడా చోటు దక్కింది. ఇక పృథ్వీ షా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. మనీష్‌ పాండే, సంజు శాంసన్‌ కూడా జట్టులోకి వచ్చారు. లంక పర్యటనకు తాను కచ్చితంగా ఎంపికవుతానని ఆశించిన సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు షాక్ తగిలింది.

కోచ్‌గా ద్రవిడ్:

కోచ్‌గా ద్రవిడ్:

శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జులై 13న ఈ పర్యటన ఆరంభం కానుంది. ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

 క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి:

క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి:

ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసింది. 24 మందితో కూడిన జట్టు అక్కడికి వెళ్లింది. జూన్‌ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసాక.. భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చింది. ఇందుకోసం 20 మందిని లంక పంపనుంది. రెండు జట్లు ఒకేసారి వేర్వేరు టీంలతో ఆడడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.

 లంక వెళ్లే భారత జట్టు:

లంక వెళ్లే భారత జట్టు:

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

Story first published: Friday, June 11, 2021, 7:38 [IST]
Other articles published on Jun 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+