For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జట్టు ఇదే.. పృథ్వి, పాండ్యా, కుల్దీప్‌కు నో చాన్స్‌!!

BCCI announce squad for ICC WTC Finals vs New Zealand
ICC WTC Finals: BCCI Announce India Squad పృథ్వి షా, పాండ్యా, కుల్దీప్‌కు నో చాన్స్‌!!

ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం టీమిండియాను ప్రకటించింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఆడినవారే ఉన్నారు. జట్టులో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. యువ ఓపెనర్ పృథ్వి షాకు మాత్రం షాక్ తగిలింది. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ కుల్దీప్‌కు జట్టులో చోటు దక్కలేదు.

అయితే 25 మంది సభ్యుల బృందంలో ఉన్న కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహాలు ఫిట్‌నెస్‌ టెస్ట్ పాస్ అయితేనే ఇంగ్లండ్ వెళ్లనున్నారు. ఇక స్టాండ్ బై ఆటగాళ్లుగా కొత్తగా నలుగురు యువకులను బీసీసీఐ ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదే జట్టు ఇంగ్లండ్ టీంతో 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో కోహ్లీసేన తలపడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ముగిశాక టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

భారత్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన అగ్రస్థానం సంపాదించింది. ఇక రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో భారత్ ఫైనల్లో తలపడనుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి ఫైనల్.

భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్‌ గిల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషబ్ పంత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా.

స్టాండ్ బై ఆటగాళ్లు:
అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా.

Story first published: Friday, May 7, 2021, 19:12 [IST]
Other articles published on May 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+