న్యూజిలాండ్‌తో మొదలై.. దక్షిణాఫ్రికాతో ముగియనున్న టీమిండియా హోమ్ సీజ‌న్‌! టీ20 ప్రపంచకప్‌ తర్వాత బిజీనే!

Team India 2021-22 Home Season Schedule, NZ తో మొదలై SA తో క్లోజ్ | BCCI || Oneindia Telugu

ముంబై: 2021-2022 సీజన్‌కు సంబంధించిన టీమిండియా క్రికెట్‌కు చెందిన హోమ్ సీజ‌న్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. 2021-22 సీజ‌న్‌లో భారత్ త‌న తొలి సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇక వ‌చ్చే ఏడాది జూన్ 19న దక్షిణాఫ్రికాతో జ‌రిగే టీ20 మ్యాచ్‌తో టీమిండియా హోమ్ సీజ‌న్ ముగుస్తుంది. నవంబరు 2021 నుంచి జూన్‌ 2022 మధ్యకాలంలో టీమిండియా వివిధ దేశాలతో 14 టీ20, 3 వన్డే, 4 టెస్టు మ్యాచులు ఆడనుంది. మొత్తానికి టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత వరుస మ్యాచులు ఆడుతూ భారత జట్టు బిజీబిజీగా గడపనుంది.

KKR vs RCB: ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మకే సాధ్యం కాలేదు.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీKKR vs RCB: ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మకే సాధ్యం కాలేదు.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ

మొదటగా న్యూజిలాండ్‌ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల్లో భారత్‌తో తలపడనుంది. తొలి టీ20 జైపూర్‌ వేదికగా నవంబర్‌ 17న జరగనుండగా.. రాంచీలో న‌వంబ‌ర్ 19, కోల్‌క‌తాలలో 21వ తేదీల్లో రెండు, మూడు టీ20లు జ‌రుగుతాయి. కాన్పూర్‌ వేదికగా తొలి టెస్ట్‌ (నవంబ‌ర్ 25 నుంచి 29 వ‌ర‌కు), ముంబైలో రెండో టెస్ట్‌ (డిసెంబ‌ర్ 3 నుంచి 7 వ‌ర‌కు) జరుగనున్నాయి. ఈ టూర్ నవంబర్‌ 17 మొదలై డిసెంబర్‌ 7న ముగుస్తుంది. 2016 తర్వాత న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి పర్యటన కానుంది. అప్పట్లో కివీస్ 3-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

ఇక వచ్చే ఏడాది.. 2022 ఫిబ్ర‌వ‌రి 6 నుంచి 20 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన అహ్మ‌దాబాద్‌లో వెస్టిండీస్‌తో వ‌న్డే మ్యాచ్ జరగనుంది. ఆ త‌ర్వాత 9, 12 తేదీల్లో జైపూర్‌, కోల్‌క‌తాలో మిగితా రెండు వ‌న్డేలు జ‌రుగుతాయి. అనంతరం ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన క‌ట‌క్‌లో జ‌రిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. వైజాగ్, త్రివేండ్రంలో 18, 19 తేదీల్లో మిగితా మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన శ్రీలంక‌తో బెంగుళూరులో తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. మొహాలీలో రెండ‌వ మ్యాచ్ జరగనుంది. మార్చి 5వ తేదీన టెస్ట్ ఆరంభం కానుంది. ఆపై మొహాలీ, ధ‌ర్మ‌శాల‌, ల‌క్నోల్లో మూడు టీ20 ఉంటాయి. 13, 15, 18 తేదీల్లో వరుసగా మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఇక జూన్ 9న దక్షిణాఫ్రికాతో చెన్నైలో తొలి టీ20 ప్రారంభం కానుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లు జ‌రుగుతాయి. బెంగుళూరు, నాగ‌పూర్‌, రాజ్‌కోట్‌, ఢిల్లీలలో మిగితా టీ20లు జరగనున్నాయి. జూన్ 12, 14, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే మధ్య కాలంలో ఐపీఎల్‌ 2022 మ్యాచులను బీసీసీఐ నిర్వహించనుంది. మరో ఏడాది వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్‌ 2022 ఉండటంతో.. 14 టీ20 మ్యాచులను షెడ్యూల్‌ చేశారని సమాచారం తెలుస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 20, 2021, 21:41 [IST]
Other articles published on Sep 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X