For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021: భారత జట్టు ఇదే.. ఓపెనర్లుగా రోహిత్, గిల్! అగర్వాల్, రాహుల్‌లకు షాక్!

BCCI announce 15 member squad for WTC Final 2021, Gill and Rohit confirmed as openers
WTC Final : Team India's 15-Member Squad తెలుగు ఆటగాళ్లు.. | KL Rahul Out || Oneindia Telugu

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో తలపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు ఆడడం ఖాయం అయింది.

తెలుగు ఆటగాళ్లకు చోటు:

తెలుగు ఆటగాళ్లకు చోటు:

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో పాటు వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహాను బీసీసీఐ ఎంపిక చేసింది. తుది జట్టులో మాత్రం పంత్ ఆడనున్నాడు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారికి జట్టులో స్థానం లభించింది. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఆడలేకపోయిన స్టార్ ఆల్‌రౌండర్‌ రవీందర్ జడేజా తిగిరి జట్టులోకి వచ్చాడు. తెలుగు ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారిలకు జట్టులో చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు పేస్ విభాగంలో ఎంపికయ్యారు.

అందుబాటులోకి కేన్‌:

అందుబాటులోకి కేన్‌:

డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో తలపడే న్యూజిలాండ్‌ జట్టును కూడా కివీస్ బోర్డు మంగళవారమే ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్​ బీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు. కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌ను స్పెషలిస్ట్‌ ఆల్‌రౌండర్‌గా.. అజాజ్‌ పటేల్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఎంపికచేశారు. సౌథాంప్టన్ పిచ్ పేస్‌కి అనుకూలించనుండడంతో.. అజాజ్ పటేల్ రూపంలో కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌కి టీమ్‌లో కివీస్ చోటిచ్చింది. ఇక బ్యాకప్ కీపర్‌గా టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు.

భారత్-న్యూజిలాండ్‌ జట్లు:

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

కివీస్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.

Story first published: Tuesday, June 15, 2021, 22:01 [IST]
Other articles published on Jun 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+