
వన్డే సిరీస్‌కు రవిశాస్త్రిని డైరెక్టర్‌గా
ఈ సిరీస్‌లో టీమిండియా ఓడినట్టయితే కోహ్లీ, శాస్త్రి ద్వయానికి ఉన్న అపరిమిత స్వేచ్ఛ, అధికారాలకు కత్తెర పడొచ్చని తెలుస్తోంది. ‘ఇదే రవిశాస్త్రి, సహాయక సిబ్బంది ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా (2014-15లో 0-2తో), దక్షిణాఫ్రికాలో (2017-18లో 1-2తో) కీలక సిరీస్‌లు చేజార్చుకున్నాం. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ అదే పరిస్థితిలో ఉన్నామని మరిచిపోవద్దు. గతంలో ఇంగ్లాండ్‌లో 1-3తో సిరీస్ చేజార్చుకున్నప్పుడు కోచ్ డంకెన్ ఫ్లెచర్‌ను, సహాయకులు జో డావ్స్ (బౌలింగ్ కోచ్), ట్రెవర్ పెన్నీ (ఫీల్డింగ్ కోచ్)ను వెంటనే తొలగించాం. ఆర్ శ్రీధర్, భరత్ అరుణ్ సహాయకులుగా వన్డే సిరీస్‌కు రవిశాస్త్రిని డైరెక్టర్‌గా చేశామని గుర్తుంచుకోవాలి' అని ఆయన అన్నారు.

కోహ్లి, శాస్త్రీలకు అధికారాలు ఎందుకు:
ఈసారి తమకు తగినంత సమయం ఇవ్వలేదని జట్టు ఫిర్యాదు చేసేందుకు వీల్లేదు. సౌతాఫ్రికాలో సిరీస్ ఓడిపోయినపుడు షెడ్యూల్‌పై ప్లేయర్స్ మండిపడ్డారు. దీంతో ఈసారి వాళ్లతో మాట్లాడిన తర్వాతే ఇంగ్లాండ్ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చేశాం అని ఆ అధికారి చెప్పారు. ఈ వరుస ఓటముల తర్వాత అసలు కోహ్లి, శాస్త్రిలకు అన్ని అధికారులు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న బీసీసీఐ వర్గాల్లో తలెత్తుతుంది.

సీనియర్ టీమ్ చెప్పినందుకే ఇండియా ఏ టీమ్‌ను:
సీనియర్ టీమ్ చెప్పినందుకే అదే సమయంలో ఇండియా ఏ టీమ్‌ను ఇంగ్లాండ్‌కు పంపించాం. అందులో ఇద్దరు సీనియర్లు విజయ్, రహానే కూడా ఉన్నారు. వాళ్లు అడిగనవన్నీ ఇచ్చాం. ఇప్పుడు అందుకు తగినట్లు ఫలితాలు రాకపోతే వాళ్లు కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే అని ఆ బీసీసీఐ అధికారి స్పష్టంచేశారు. ఇప్పటికే రవిశాస్త్రి, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నేతృత్వంలో ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో ఓడిందని, ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు.

అప్పటి కోచ్ ఫ్లెచర్‌ను తీసేసిన విషయాన్ని:
గతంలో ఇంగ్లాండ్‌లో సిరీస్ ఓడిపోయినపుడు అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బోర్డు తీసేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంటే పరోక్షంగా రవిశాస్త్రికే అదే జరగబోతుందా అనే అనుమానాలు రేకెత్తించారు. ఇక ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌పైనా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అతడు ఫీల్డింగ్ కోచ్ అయిన తర్వాత స్లిప్ ఫీల్డింగ్ దారుణంగా ఉంది. ఇప్పటివరకు స్లిప్ ఫీల్డర్లు 50 క్యాచ్‌లు జారవిడిచారు. ఇక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కూడా విదేశీ సిరీస్‌లకు తగినట్లుగా బ్యాట్స్‌మెన్‌ను సిద్ధం చేయలేకపోతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమిటీలో సెలక్టర్ కావాలని గవాస్కర్ డిమాండ్
టీమ్‌ను ఎంపిక చేయడంతోపాటు టూర్ సెలక్షన్ కమిటీలో ఓ సెలక్టర్ భాగం కావాలని గవాస్కర్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా గాయంతో బాధపడుతున్న కోహ్లి మూడో టెస్ట్‌కు దూరమైతే ఎవరిని కెప్టెన్ చేయాలన్నదానిపైనా చర్చ జరుగుతుంది. వైస్ కెప్టెన్ రహానేకు మూడో టెస్ట్‌లో ప్లేసే అనుమానంగా మారింది. అతడు లేకపోతే అశ్విన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












