Bio-bubble Fatigue: ఇక బీసీసీఐ, ద్రవిడ్ చేతుల్లోనే అంతా.. టీమిండియా ఆటగాళ్లకు పండగే!!

ముంబై: టీ20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా భారత్ సెమీస్‌కు చేరుకోలేకపోయింది. ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్‌లో ఉండటం, వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యానికి ముఖ్య కారణమనే విమర్శలు బలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుందట.

ప్రత్యేక కమిటీ:
తీరిక లేని క్రికెట్, బయో బబుల్ కారణంగానే టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ విఫలమైదన్న విమర్శల నేపథ్యంలో బీసీసీఐ ప్రమత్తమైంది. ఇకపై ఆటగాళ్లపై పని ఒత్తిడిని అంచనా వేసి.. ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బీసీసీఐనే నిర్ణయించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఒక కమిటీని కూడా నియమించనుందట. ఆ కమిటీలో భారత కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సభ్యుడిగా ఉంటాడన తెలుస్తోంది. ఏ ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు, ఎంత కాలం బయో బబుల్లో గడుపుతున్నాడు అన్న విషయాలను సమీక్షించి.. ప్రతి ఆటగాడికి విశ్రాంతిని ఇచ్చేలా ఈ కమిటీ చూస్తుందట.

బీసీసీఐనే నిర్ణయించబోతోంది:
ఇప్పటిదాకా విశ్రాంతి తీసుకోవడం భారత ఆటగాళ్లు చేతుల్లోనే ఉండేది. కొన్నిసార్లు విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న ఆటగాళ్లను గుర్తించి సెలక్టర్లే వారికి విశ్రాంతి కల్పించేవారు. తాజాగా న్యూజీలాండ్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. గత కొంత కాలంగా వీరు తీరికలేని క్రికెట్ ఆడడమే ఇందుకు కారణం. అలసట, బయో బబుల్ ఒత్తిడి గురించి ఆటగాళ్ల నుంచి ఇటీవలి కాలంలో ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో బీసీసీఐ ఈ కొత్త విధానానికి సిద్ధమైంది. దీని ప్రకారం ఏ ఆటగాడికి ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలన్నది ఇకనుంచి బీసీసీఐనే నిర్ణయించబోతోంది. దాంతో తీరికలేని టీమిండియా ఆటగాళ్లకు పండగే అనే చెప్పొచ్చు.

స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి:
నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ రోహిత్ శర్మకు అందించింది. మొత్తం 16 సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా న్యూజిలాండ్ సిరీస్‌కు వ్యవహరించనున్నారు. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్.. మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications