Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వుమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం ఫిక్స్.. అందుకోసం స్పెషల్ విండోను ప్రకటించిన బీసీసీఐ

BCCI Allocated Special Window For Womens IPL Next Year in March

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా.. మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధం చేసింది. వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిషన్ కోసం 2023లో మార్చిలో సెపరేటు విండోను కేటాయించింది. బోర్డు ప్రకారం.. వుమెన్స్ ఐపీఎల్ ఎలాగైనా పట్టాలెక్కించేందుకు అన్ని ప్రక్రియలు చేస్తోంది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఈ విషయంలో ప్రత్యేక చొరవ కనబర్చడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మహిళల దేశీయ క్రికెట్ క్యాలెండర్‌లో మార్పులు చేసింది. సాధారణంగా డొమెస్టిక్ క్రికెట్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొనసాగే మహిళల సీజన్‌ను ఒక నెల ముందుగా ప్రారంభించేలా బీసీసీఐ షెడ్యూల్లో మార్పులు చేసింది. అక్టోబర్ 11న టీ20పోటీలతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. 2023 ఫిబ్రవరిలో ఇంటర్-జోనల్ వన్డే పోటీతో మహిళల సీజన్ ముగుస్తుంది.

మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్

మూడు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్

2018నుంచి బీసీసీఐ మహిళల టీ20 ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చివర్లో మూడు జట్లతో ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు ఇతర దేశాల ప్లేయర్లు కూడా ఈ పోటీలో ఆడుతున్నారు. అయినప్పటికీ మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే చాలా మహిళల ఐపీఎల్ కూడా జరగాలని ఇటీవల డిమాండ్లు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ను నిర్వహిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'మేము పూర్తి స్థాయి డబ్ల్యుఐపిఎల్‌ని కలిగి ఉండటానికి అన్ని మార్గాలు చూస్తున్నాం. ఇది కచ్చితంగా జరగబోతోంది. వచ్చే ఏడాది (2023) నుంచి పూర్తిస్థాయి మహిళల ఐపిఎల్‌ను ప్రారంభించడానికి చాలా మంచి సమయం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మెన్స్ ఐపీఎల్‌గా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో మనందిరికీ తెలిసిందే' అని గంగూలీ అప్పట్లో చెప్పాడు.

ఆసక్తి కనబర్చుతున్న ఫ్రాంచైజీలు

ఆసక్తి కనబర్చుతున్న ఫ్రాంచైజీలు

ఇకపోతే ఐపీఎల్ ఫ్రాంచైజీ సంస్థలయిన రాజస్థాన్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్, ది నైట్ రైడర్స్ గ్రూప్ యజమానులు వుమెన్స్ ఐపీఎల్ జట్లను సొంతం చేసుకోవడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన అంశాలపై బీసీసీఐ పూర్తి డిటైల్స్ రిలీజ్ చేస్తుందని, అంతలోపు జట్లను సొంతం చేసుకోవడానికి డబ్బులు అరెంజ్ చేసుకోవడాని ఈ ఫ్రాంచైజీలతో పాటు పలు కొత్త యజమానులు సైతం రెడీ అవుతున్నారు. ఇక వుమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకానికి సైతం భారీ డిమాండ్ ఉండొచ్చు.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia
 వుమెన్స్ టీంకు పెరిగిన ఆదరణ

వుమెన్స్ టీంకు పెరిగిన ఆదరణ

ఇటీవల ఐసీసీ ఈవెంట్‌లలో ఇండియా వుమెన్స్ టీం మెరుగైన ప్రదర్శన కనబర్చుతుంది. భారతదేశంలో మహిళల క్రికెట్‌ పట్ల మునుపెన్నడూ లేని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మాజీ కెప్టెన్ మిథాలీ‌రాజ్ తదితర స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడడానికి తాము సై అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీ రాజ్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో పాల్గొనడానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.

Story first published: Friday, August 12, 2022, 21:16 [IST]
Other articles published on Aug 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+