Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ కొత్త చీఫ్ బిన్నీపై అజరుద్దీన్ కీలక వ్యాఖ్యలు - ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ పైనా..!!

BCCI AGM: No discussions on the ICC chairman post, it will decide later, says Azharuddin

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ అపాయింట్ అయ్యారు. బీసీసీఐకి ఆయన 36వ అధ్యక్షుడు. సౌరవ్ గంగూలీ స్థానంలో ఆయనను ఎన్నుకుంది బీసీసీఐ సర్వ సభ్య సమావేశం. ఈ ఉదయం ముంబైలో ఏర్పాటైన ఈ సమావేశం సందర్భంగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆయన నియామకంతో ఇక సౌరవ్ గంగూలీ కుర్చీ దిగారు. బీసీసీఐ అధ్యక్షుడిగా అపాయింట్ అయిన రోజర్ బిన్నీ ఆ స్థానంలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.

మిగిలిన కార్యవర్గం కూడా..

మిగిలిన కార్యవర్గం కూడా..

బీసీసీఐ పదవికి నిర్వహించదలిచిన ఎన్నికలో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సౌరవ్ గంగూలీ దూరంగా ఉన్నారు. అదే సమయంలో బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా అదే పదవిలో కొనసాగనున్నారు. రోజర్ బిన్నీని తదుపరి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడానికి, జై షాను కార్యదర్శిగా కొనసాగించడానికి బోర్డు సభ్యులు సైతం అంగీకారం తెలిపారు.

హాజరైంది వీరే..

హాజరైంది వీరే..

ఈ ఉదయం ముంబైలో ఆరంభమైన వార్షిక సర్వ సభ్య సమావేశానికి సౌరవ్ గంగూలీ, జై షా, రోజర్ బిన్నీ, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇతర సభ్యులు, వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సాయంత్రం వరకూ కొనసాగనుందీ సమావేశం. పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

బిన్నీ అపాయింట్‌పై..

బిన్నీ అపాయింట్‌పై..

బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశానికి మహ్మద్ అజరుద్దీన్ హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో ఇందులో పాల్గొన్నారాయన. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ నియామకం కావడం పట్ల ఈ టీమిండియా మాజీ కేప్టెన్ స్పందించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోజర్ బిన్నీతో కలిసి తాను పలు మ్యాచ్‌లను ఆడానని అన్నారు. తమ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు.

ఐసీసీ ఛైర్మన్ పోస్ట్‌పై..

ఐసీసీ ఛైర్మన్ పోస్ట్‌పై..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ పోస్ట్‌పైనా అజరుద్దీన్ మాట్లాడారు. దీనిపై ప్రస్తుతానికి బీసీసీఐ సమావేశంలో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. బోర్డు సభ్యులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. రోజర్ బిన్నీ నియామకంతో పాటు కొన్ని కీలకమైన అంశాలను అంజెడాగా తీసుకున్నామని, వాటిపై చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనిపై బోర్డ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, October 18, 2022, 14:03 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+