న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్నికల తాకిడి ప్రభావంతో బీపీఎల్ నిర్వహించడం లేదట

BCB postpone sixth edition of BPL to January 2019

హైదరాబాద్: ఎలక్షన్ ఎఫెక్ట్ క్రికెట్ మీద కూడా పడింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బీపీఎల్ లీగ్ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బీపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ అక్టోబర్ తర్వాత బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో.. భద్రత కల్పించలేమని పోలీసు యంత్రాంగం చేతులెత్తేసింది.

ఈ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మిర్పూర్‌లో టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు, ఫ్రాంచైజీల ప్రతినిధుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

బీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో..

బీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో..

‘బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే వీలుంది. దీంతో జనవరి 5, ఫిబ్రవరి 8 తేదీల మధ్య బీపీఎల్ నిర్వహించనున్నాం' అని బీపీఎల్ టెక్నికల్ కమిటీ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. బీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో.. అక్టోబర్లో జింబాబ్వే బంగ్లా పర్యటనకు రానుంది. ఇరు జట్లు మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనున్నాయి.

మెగా టోర్నమెంట్ కన్నా ముందే ఐపీఎల్‌ను

మెగా టోర్నమెంట్ కన్నా ముందే ఐపీఎల్‌ను

బీసీసీఐ కూడా ఈ విషయంపై ఓ కన్నేసింది. మరో పది నెలల్లో ఆరంభం కానున్న ఐపీఎల్-12 సీజన్‌కు అప్పుడే సన్నాహాలు మొదలైయ్యాయి. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ కన్నా ముందే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల వ్యవధి

ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల వ్యవధి

లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఐపీఎల్‌కు, ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోపు ఐపీఎల్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ 2019, మార్చి 29న ఐపీఎల్-12 సీజన్‌ను ఆరంభించాలని సన్నాహాలు చేస్తోంది.

Story first published: Monday, July 30, 2018, 13:43 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X