Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెక్సిజం వ్యాఖ్యలు: గేల్‌కు షాక్, బీబీఎల్ నుంచి ఔట్

మెల్‌బోర్న్: వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ప్రాంఛైజీ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో జరగనున్న బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్‌కు క్రిస్ గేల్ కాంట్రాక్టును పునరుద్ధరించేది లేదని ఆ ప్రాంఛైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాట్ స్పష్టం చేశారు.

కొన్ని నెలల కిందట బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌ సందర్భంగా మ్యాచ్‌ మధ్యలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ చార్లొట్‌తో తనది చాలా పెద్ద బ్యాట్ అంటూ డబల్ మీనింగ్ వచ్చేలా క్రిస్‌ గేల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపాయి. ఇటీవల ఇంగ్లీషు కౌంటీల్లో సోమర్సెట్ తరుపున ఆడేందుకు లండన్‌కు వెళితే అక్కడ విమర్శల పాలయ్యాడు.

తాజాగా క్రిస్ గేల్ 'సెక్సిజం' వ్యాఖ్యల నేపథ్యంలో గేల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించ కూడదని బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణయించింది. టైమ్ మహిళా జర్నలిస్ట్‌తో ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడినందుకు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను గేల్ ఎదుర్కొన్నాడు.

అంతేకాదు గేల్‌పై విమర్శలు చేసిన వాళ్లపై కూడా విరుచుకుపడి తన జోలికి రావద్దని పరుష పదజాలంతో హెచ్చరించాడు. గతేడాది వేసవిలో బీబీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రిస్ గేల్ మెల్ బోర్న్ రినిగేడ్స్ జట్టు తరుపున ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీని టీ20ల్లో సాధించి రికార్డు సృష్టించాడు. 8 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 260 పరుగులు చేసి 32.50 యావరేజితో కొనసాగుతున్నాడు.

అప్పట్లో మహిళా జర్నలిస్ట్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇయాన్‌ చాపెల్‌, ఆండ్రూ ప్లింటాఫ్‌ తదితరులు ఆ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు గేల్‌కు మెల్ బోర్న్ రినిగేడ్స్ జట్టు 10 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఒకానొక దశలో గేల్‌ను లీగ్‌కు దూరం పెట్టే ఆలోచన కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా చేసింది.

BBL team Renegades not to re-sign Chris Gayle after fresh sexism row

అయితే, అప్పటి తన వ్యాఖ్యలపై త్వరలో విడుదల కానున్న ఆత్మకథలో వివరణ ఇస్తూ.. విమర్శకులపై విరుచుకుపడ్డాడు గేల్‌. 'ప్రస్తుతం మనం టీ20ల యుగంలో ఉన్నాం. ఇది టెస్టు క్రికెట్‌ కాదు. ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలి. నేను సరదాగా జోక్‌ చేశానంతే. ఎవరినో అగౌరవపరచాలని కాదు' అని పేర్కొన్నాడు.

అంతేగాక, 'మ్యాచ్‌ల మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్‌ నాకు పాఠాలు చెప్పడమేంటి? అతనెప్పుడైనా నాకు షార్ట్‌ పిచ్‌ బంతి వేస్తే అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్లో బౌండరీగా తేలేది. అతనో పిల్లవాడు. ఇక వెస్టిండీస్‌లో క్రికెట్‌ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్‌ చాపెల్‌ నన్ను క్రికెట్‌ నుంచి నిషేధించాలని డిమాండ్‌ చేస్తాడా? అతను మొత్తం క్రికెట్‌నే నిషేధించాలని కూడా అనగలడు' అని గేల్‌ విమర్శలు గుప్పించాడు.

తానో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా వయాగ్రా మాత్రలు వాడి చాలా ఇబ్బంది పడ్డానని ఫ్లింటాఫ్‌ గతంలో అన్న నేపథ్యంలో గేల్‌ ఇలా చురకలంటించాడు. ఇది ఇలా ఉండగా, క్రిస్ రోజర్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు గేల్. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు.

తాను ఎక్కువగా బార్లలోనే గడుపుతానని అతను ఎలా అంటాడని నిలదీశాడు. మరోసారి తనపై ఆరోపణలు చేస్తే అతని నోట్లో చుయింగ్ గమ్ బదులు క్యారెట్ ఉంటుందని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+