Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

174 స్ట్రైక్ రేట్.. ఆర్సీబీ ప్లేయర్ ధనాధన్ ఇన్నింగ్స్ - స్టేడియం షేక్!!

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడని బెంగళూరు.. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2025కు ముందు ఆ జట్టు ప్లేయర్ తన బ్యాట్ తో తుపాను సృష్టించాడు. ఎవరంటే?

ప్రస్తుతం బిగ్‌ బాష్‌ లీగ్‌ సాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ హోబర్ట్‌ హరికేన్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ లీగ్ లో పేలవ ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ జట్టు స్టార్‌ ప్లేయర్‌ జాకోబ్ బెతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. హోబర్ట్‌ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్‌ 174 స్ట్రైక్ రేట్ తో, మెరుపు హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. దీంతో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

BBL 2025 RCB all-rounder Jacob Bethel scores super fast half century in BBL league

మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌లో జాకోబ్ బెతెల్ తప్ప ఇంకెవ్వరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టిమ్‌ సీఫర్ట్‌ (24), కెప్టెన్‌ సదర్‌ల్యాండ్‌ (15) మాత్రమే పర్వాలేదనిపించారు. మెక్‌గుర్క్‌ 7, జోష్‌ బ్రౌన్‌ 6, జేక్‌ ఫ్రేజర్‌ హ్యారీ డిక్సన్‌ 1, మార్కస్‌ హ్యారిస్‌ 1, ఫెర్గస్‌ ఓనీల్‌ 2 (నాటౌట్‌), టామ్‌ రోజర్స్‌ 5 (నాటౌట్‌) పరుగులు సాధించారు. హరికేన్స్‌ బౌలర్లలో రిలే మెరిడిత్‌ మూడు వికెట్లు తీశాడు. నాథన్‌ ఇల్లిస్‌, మిచెల్‌ ఓవెన్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, రీసెంట్ గా జరిగిన ఐపీఎల్‌ వేలంలో జాకోబ్ బెతెల్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 2.6 కోట్లకు సొంతం చేసుకుంది. అతడిపై భారీ అంచనాలను పెట్టుకుంది. అయితే బీబీఎల్‌ ఫస్ట్ హాఫ్ లో బేతెల్‌ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. కానీ ఇప్పుడు తాజా మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బీబీఎల్‌-2025లో బేతెల్‌ ప్రదర్శనలు ఎలా ఉన్నాయంటే
87(50) vs హోబర్ట్ హరికేన్స్, 1(8) vs మెల్బోర్న్ స్టార్స్, 2(9) vs పెర్త్ స్కార్చర్స్,
49(36) vs మెల్బోర్న్ స్టార్స్, 21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్, 2(4) vs సిడ్నీ థండర్, 30(22) vs పెర్త్ స్కార్చర్స్, 3(6) vs హోబర్ట్ హరికేన్స్

Story first published: Tuesday, January 14, 2025, 19:11 [IST]
Other articles published on Jan 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+