Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL 2023: ప్రమాదకరంగా పిచ్- మ్యాచ్ క్యాన్సిల్.. ప్లేయర్లు షాక్! (వీడియో)

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో పిచ్ సమస్య కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరుగుతున్న పోరులో ఈ అనూహ్య ఫలితం వచ్చింది. మ్యాచ్ 6.5 ఓవర్ల పాటు సాగిన తర్వాత అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

మెల్ బోర్న్ జట్టు టాస్ గెలిచి పెర్త్ టీమ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే మరో ఓపెనర్ కూపర్ (6) కూడా వెనుదిరిగాడు. అయితే బౌలర్లు విసిరే బంతులకు పిచ్ భిన్నంగా స్పందిస్తుండటంతో తొలుత అందరూ షాక్ అయ్యారు.

BBL 2023:Melbourne Renegades vs Perth Scorchers Match abandoned due to unsafe pitch

అనూహ్యంగా బంతి బౌన్స్ అవ్వడంతో బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో మ్యాచ్ ను కాసేపు అంపైర్లు నిలిపివేశారు. ఇరు జట్లు కెప్టెన్లతో చర్చించి.. పిచ్ ప్రమాదకంగా ఉందని, ఆటను కొనసాగించడానికి వీళ్లేదని మ్యాచ్ ను రద్దు చేశారు. నిన్నరాత్రి కురిసిన వర్షం కారణంతో ఇలా జరిగి ఉంటుందని, కవర్స్ లీక్ అయ్యి నీరు పిచ్ పై చేరి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులకు ఇది అవమానకరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శనివారం జరగాల్సిన అడిలైడ్ స్ట్రైకర్స్ - బ్రిస్బేన్ హీట్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దైంది. వరుణుడి రాకతో టాస్ కూడా పడకుండా మ్యాచ్ ను రద్దు చేశారు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ముప్పు లేకపోయినా పిచ్ కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

Story first published: Sunday, December 10, 2023, 15:25 [IST]
Other articles published on Dec 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+