క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! (వీడియో)

BBL 2020-21: Adelaide Strikers Batsman Run Out At Both Ends In Bizarre Dismissal

సిడ్నీ: ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్​బాష్ ​లీగ్​లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ ఘటన ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌటయ్యాడు. ఆదివారం అడిలైడ్​ వేదికగా అడిలైడ్​ స్ట్రైకర్స్​, సిడ్నీ థండర్​ మధ్య జరుగిన మ్యాచులో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

ఇంతకేం జరిగిందంటే.. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన అడిలైడ్ స్ట్రైక్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్​ 10వ ఓవర్లో సిడ్నీ థండర్​ బౌలర్ క్రిస్​ గ్రీన్ వేసిన బంతిని​.. అడిలైడ్ బ్యాట్స్‌మన్ ఫిల్​ సాల్ట్​ నేరుగా బౌలర్​ వైపు ఆడాడు. అది కాస్తా గ్రీన్​ చేతికి తాకుతూ వికెట్లను గిరాటేసింది. దీంతో నాన్​స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న వెదర్లాడ్​ రనౌట్​ అయ్యాడు. అయితే బౌలర్​ చేతికి బంతి తాకిందో లేదో తికమక పడుతూనే వెదర్లాడ్​ స్టైకర్​ఎండ్ ​వైపుకు సింగిల్​ తీశాడు. తన బ్యాటును క్రీజులో పెట్టేలోపే.. బంతి అందుకున్న వికెట్​ కీపర్​ మరోసారి రనౌట్​ చేశాడు. అలా ఒకే బంతికి రెండు రనౌట్లు నమోదయ్యాయి. చివరగా అంపైర్లు సమీక్షకు వెళ్లగా.. తొలి ప్రయత్నంలోనే ఔటైనట్లు తేలింది.

ఇక ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగులతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. జేక్ వెదర్ లాడ్(31), ఫిల్ సాల్ట్(31), ట్రావిస్ హెడ్ (31) రాణించారు. అనంతరం సిడ్నీ థండర్ నిర్ణత ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులే చేసింది. ఉస్మాన్ ఖావాజా(36), బెన్ కట్టింగ్(24 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, January 24, 2021, 18:16 [IST]
Other articles published on Jan 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X