న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రనౌటైన కోపంలో ఆరోన్ ఫించ్ ఏం చేశాడో తెలుసా? (వీడియో)

Aaron Finch Breakdown The Chair After Getting Run-Out | Oneindia Telugu
BBl 2019 Final: Melbourne Renegades’ skipper Aaron Finch smashes chair after getting run-out – Watch

హైదరాబాద్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ మైదానంలో సహనం కోల్పోయాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌-మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ జట్టు కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ తన ఏమరుపాటు కారణంగా రనౌటయ్యాడు.

కేఎల్ రాహుల్ ఫామ్ ప్రపంచ కప్ కు చాలా ముఖ్యం : ఎమ్మెస్కె ప్రసాద్కేఎల్ రాహుల్ ఫామ్ ప్రపంచ కప్ కు చాలా ముఖ్యం : ఎమ్మెస్కె ప్రసాద్

మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బౌలర్ జాక్సన్ వేసిన బంతిని క్రీజులో ఉన్న కామెరూన్ ఆడాడు. అయితే, ఆ బంతి నేరుగా బౌలర్ వద్దకు సమీపించడంతో వెంటనే దానిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో లేని పరుగుల కోసం ప్రయత్నించిన ఆరోన్ ఫించ్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో ఫించ్‌ మైదానంలోనే సహనం కోల్పోయాడు.

దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరుతూ స్టేడియం లోపల ఉన్న ఛైర్‌ను బ్యాటుతో కొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఛైర్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Story first published: Tuesday, February 19, 2019, 12:02 [IST]
Other articles published on Feb 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X