For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్ బాష్ లీగ్‌లో టాస్ 2 సార్లు ఎందుకేశారో తెలుసా?

BBL 2018-19: The Bat Flip Toss Goes Horribly Wrong
BBL 2018-19: The bat flip goes horribly wrong

సిడ్నీ: క్రికెట్‌లో కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ క్రికెట్ కంటే ముందు దేశీవాలీ లీగ్‌లలోనే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే టాస్ వేసేందుకు కాయిన్‌కు బదులు బ్యాట్‌ను వాడుతూ.. ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ పాత పద్ధతిని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, పెర్త్ స్క్రాచర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో టాస్ వేస్తుండగా గమ్మతు చోటు చేసుకుంది.

స్క్రాచర్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ టాస్ వేసేందుకు బ్యాట్ తీసుకున్నాడు. స్టైకర్స్ కెప్టెన్ అయిన కొలిన్ ఇన్‌గ్రామ్ చాయీస్ ఎంచుకోవాల్సిన పరిస్థితి. కానీ, బ్యాట్ అటుఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింది. కాసేపటి వరకూ అక్కడ ఉన్న వారంతా ఆగిపోవడంతో మ్యాచ్ అధికారి దానిని తీసుకునేందుకు ముందుకు ఒంగబోయాడు. ఈ లోపు స్క్రాచర్స్ కెప్టెన్ బ్యాట్‌ను తనకు అనుకూలంగా తిప్పేసుకుని చాయీస్ చెప్పేశాడు.

కాసేపు నవ్వుకున్న ఇరు జట్ల కెప్టెన్లు మళ్లీ టాస్ వేయడంతో ఈ సారి స్క్రాచర్స్ కెప్టెన్‌కు అనుకూలంగానే టాస్ పడింది. దాంతో బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును 17.2 ఓవర్లకే కట్టడి చేశాడు. ఈ క్రమంలో చేధనకు దిగిన జట్టును స్ట్రైకర్స్ 25 పరుగులకే తొలి వికెట్‌ను పడగొట్టగలిగింది. ఇలా 46పరుగులకే 7 వికెట్లు కొల్లగొట్టారు. కానీ, స్ట్రైకర్స్ జట్టు అనుకున్నది సాధించలేకపోయింది.

స్క్రాచర్స్ జట్టు 18 ఓవర్లకే టార్గెట్‌ను పూర్తి చేసి మ్యాచ్ గెలిచింది. కెప్టెన్ సైతం 46 బంతులకు కేవలం 24పరుగులు మాత్రమే చేయడంతో స్ట్రైకర్స్ జట్టు ఓటమికి గురైంది. దీంతో పెర్త్ స్క్రాచర్స్ జట్టుకు లీగ్‌లో తొలి విజయం నమోదైంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో స్ట్రైకర్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సిడ్నీ థండర్, మెల్‌బౌర్న్ రెనెగడెస్, హోబర్ట్ హరికేన్స్ జట్లు రెండు గేమ్స్ గెలుచుకున్నారు. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌లలో సిడ్నీ మాత్రమే ఉత్తమ రన్ రేట్‌తో టాప్ స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, December 26, 2018, 19:00 [IST]
Other articles published on Dec 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+