T20 World Cup 2022: ఆ నలుగురికి ఏమైంది.. ఇప్పటికైనా టచ్‍లోకి వస్తారా..

వారు క్రికెట్ ప్రపంచంలో తమకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మేటి ఆటగాళ్లుగా పేరు పొందారు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ లో మాత్రం వారు విఫలమవుతున్నారు ఆ నలుగురు. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం, ఆస్ట్రేలియా ఓపెనర్ డెవిడ్ వార్నర్, సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా, ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఈ వరల్డ్ కప్ వారు ఇంత వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

బాబర్ అజాం
ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాట్స్ మెన్‍గా ఉన్న బాబర్ అజాం ప్రస్తుతం ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఫామ్ తో పాటు అతను నాయకత్వం వహిస్తున్న జట్టు జింబాబ్వే పై కూడా ఓడిపోయింది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే బాబర్ చెత్త కెప్టెన్ అని అనేశాడు. బాబర్ టీ20 వరల్డ్ కప్ భారత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో బాబర్ అజాం డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత జింబాబ్వేపై 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ పై కూడా నాలుగే పరుగులు చేశాడు.

డెవిడ్ వార్నర్
గతేడాది ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పొషించిన డెవిడ్ వార్నర్ ప్రస్తుతం వరల్డ్ కప్ విఫలమవుతున్నాడు. అతను మొదటి పై న్యూజిలాండ్ పై ఆడగా.. 5 పరుగులే చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 11 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు అయింది. సోమవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 3 పరుగలే చేశాడు. దీంతో అతనిపై ఒత్తిడి పెరిగింది.

కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం పెర్త్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్ క్రీజ్ లో ఉన్నంత సేపు అసౌకర్యంగా ఉన్నాడు. మొదటి ఓవర్ లో ఒక్క పరుగు కూడా చేయకుండా మెయిడిన్ చేశాడు.కేఎల్ రాహుల్ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులే చేశాడు.

బావుమా
సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా కూడా పరుగులు చేయడం లేదు. అతను అంతకు ముందు భారత్ పర్యటనలో కూడా అంతగా రాణించలేదు. బావుమా ఈ వరల్డ్ కప్ జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లా దేశ్ తో జరిగిన మ్యాచ్ లో 2 పరుగులు చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications