Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: ఐదుగురు బ్యాటర్లు ఐదు పరుగులు కూడా చేయకపోతే.. ఓడిపోక ఏం చేస్తారు?

Batters fail to put up a fight as Renegades lost miserably

బ్యాటర్లలో ఇద్దరు తప్ప మిగతా అందరూ విఫలమవడంతో బిగ్ బ్యాష్ లీగులో రెనగేడ్స్ జట్టు ఓటమి చవిచూసింది. సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ రెనగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచిన రెనగేడ్స్ సారధి నిక్ మ్యాడిన్సన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సిడ్నీకి ఓపెనర్ జోష్ ఫిలిప్ (55) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కర్టిస్ ప్యాటర్సన్ (17) కూడా ఫర్వాలేదనిపించాడు.

వీళ్ల తర్వాత వచ్చిన జేమ్స్ విన్స్ (26), జోర్డాన్ సిల్క్ (19) కూడా రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చెయ్యలేకపోయారు. కెప్టెన్ మోజెస్ హెన్రిక్స్ (1), డాన్ క్రిస్టియన్ (7), హేడెన్ కెర్ (1), బెన్ డ్వార్షూయిస్ (6 నాటౌట్), షాన్ ఆబాట్ (1), జాక్సన్ బర్డ్ (13 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రెనగేడ్స్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. విల్ సదర్‌ల్యాండ్, కేన్ రిచర్డ్‌సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

లక్ష్య ఛేదనలో రెనగేడ్స్‌కు శుభారంభం దక్కలేదు. మార్టిన్ గప్తిల్ (0), నిక్ మ్యాడిన్సన్ (1) ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆరోన్ ఫించ్ (36), షాన్ మార్ష్ (28) మాత్రమే ఆ జట్టులో కొంత పోరాడారు. మిగతా బ్యాటర్లు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. జొనాథన్ వెల్స్ (1), పీటర్ హాండ్స్‌కోంబ్ (3), అకీల్ హొస్సేన్ (3), కేన్ రిచర్డ్‌సన్ (8), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (0) ఎవరూ ఆకట్టుకోలేదు. చివర్లో విల్ సదర్‌ల్యాండ్ (13), టామ్ రాజర్స్ (14 నాటౌట్) కొంత పోరాడారు. దీంతో ఆ జట్టు 19 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టును బంతితో దారుణంగా దెబ్బతీసిన బెన్ డ్వార్షూయిస్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. షాన్ ఆబాట్, హేడెన్ కెర్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. టాడ్ మర్ఫీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బెన్ డ్వార్షూయిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభిం

Story first published: Wednesday, December 28, 2022, 18:44 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+