Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంతితో పరిగెత్తిన బ్యాటర్.. వెంటపడిన కీపర్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

క్రికెట్‌లో చాలాసార్లు ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. అవి చూసిన వాళ్లు ఎంత ట్రై చేసిన నవ్వు ఆపుకోలేరు. తాజాగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శ్రీలంకలోని గాలె స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ పదకొండో నెంబర్ బ్యాటర్ అబ్రార్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఫన్నీ సీన్ జరిగింది.

అబ్రార్ తన ఫన్నీ చేష్టలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఈ క్రమంలోనే పాక్ మొదటి ఇన్నింగ్స్ 120వ ఓవర్లో జరిగిన ఘటన అందర్నీ నవ్వించింది. లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ వేసిన బంతిని అబ్రార్ సరిగా ఆడలేకపోయాడు. ఆ బాల్ టర్న్‌ను అంచనా వేయలేక తడబడ్డాడు. దీంతో అతని గ్లవ్‌ను తాకిన బంతి.. అతని ప్యాడ్‌లో ఇరుక్కుంది. అది చూసిన లంక వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ.. బంతిని కలెక్ట్ చేసుకునేందుకు వచ్చాడు.

cricket

అయితే అబ్రార్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. గబుక్కున పక్కకు తప్పుకొని సమరవిక్రమకు.. తన ప్యాడ్లోని బంతి అందకుండా తప్పించుకున్నాడు. అయితే ఇలా చేసే క్రమంలో పొరపాటున క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. ఇది గుర్తించిన వెంటనే మళ్లీ వెనక్కు తిరిగిన అతను.. సమరవిక్రమ త్రో వేయకముందే క్రీజులోకి వెళ్లిపోయాడు. ఈ సీన్ చూసిన వాళ్లంతా నవ్వుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ సమయంలో అబ్రార్ చేసిన పనికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. ఈ వీడియోలో అతను పెద్దగా నవ్వేస్తూ కనిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అబ్రార్ పది పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ అచింది. దీంతో శ్రీలంకపై మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ 149 పరుగుల ఆధిక్యం సాధించింది.

Story first published: Wednesday, July 19, 2023, 9:46 [IST]
Other articles published on Jul 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+