For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన్కడ్ చేశాడని.. బ్యాటు, హెల్మెట్ విసిరి కొట్టిన బ్యాటర్.. వీడియో వైరల్!

 Batter throws bat in anger after getting mankad

గత కొంత కాలంగా క్రికెట్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఐసీసీ.. ఇటీవలే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్‌ను 'మన్కడింగ్' చేయడాన్ని లీగల్ చేసింది. అంతకుముందు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్‌కు విరుద్ధంగా ఉన్న ఈ రూల్‌ను 'నాన్ స్ట్రైకర్ రనౌట్' కిందకు మార్చింది. కానీ దీన్ని ఉపయోగించడానికి చాలా మంది ఆటగాళ్లు ఇంకా వెనుకాడుతూనే ఉన్నారు. అయితే కొందరు మాత్రం అవకాశం దొరికితే ఇలా అవుట్ చేసి వికెట్లు తీసుకుంటున్నారు.

ఇలా ఎవరైనా అవుటైన ప్రతిసారీ ఆ విషయం వార్తల్లో పతాక శీర్షికలకు ఎక్కుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. న్యూ నార్‌ఫోక్ క్రికెట్ క్లబ్, క్లార్‌మోంట్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. టాస్మానియా బ్యాటర్ జారడ్ కాయే.. క్లార్‌మోంట్ తరఫున ఆడుతున్నాడు. అతను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా న్యూ నార్‌ఫోక్ బౌలర్ హ్యారీ బూత్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు.

కుడి చేతి వాటం బౌలర్ అయినా హ్యారీ బూత్.. బౌలింగ్ చేయడానికి వస్తున్నప్పుడే జారెడ్ తన క్రీజును వదిలి ముందుకు అడుగు వేశాడు. అది చూసిన హ్యారీ మరో ఆలోచన లేకుండా బంతి వేయకుండా వికెట్లను కూల్చాడు. జారెడ్ క్రీజు దాటాడని అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇది చెక్ చేయగా జారెడ్ క్రీజు దాటేయడంతో అంపైర్లు కూడా పెద్దగా ఆలోచించకుండానే జారెడ్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయం అతనికి ఏమాత్రం నచ్చలేదు.

ఇలా రనౌట్ అవడంతో జారెడ్‌ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో తన బ్యాటును పెవిలియన్ వైపు విసిరి కొట్టాడు. హెల్మెట్ కూడా తీసి అటువైపు విసిరేశాడు. అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని పరుష పదాలతో తిడుతూ బౌండరీ లైన్ దాటిన తర్వాత గ్లవ్స్ కూడా విసిరి కొట్టాడతను. క్లార్‌మోంట్ ప్లేయర్లు కూడా మైదానంలోకి వచ్చి తమ అసహనాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియన్ మీడియా నెట్టింట షేర్ చేయగా.. అది తెగ వైరల్ అవుతోంది.

Story first published: Tuesday, March 28, 2023, 17:39 [IST]
Other articles published on Mar 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+