Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రోజంతా ఆడినా 280 పరుగులు చేయడం కష్టమయ్యేది'

'Batsmen scoring 400 is possible in ODIs'

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రస్తుత క్రికెటర్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్ముందు వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు 400 కూడా బాదేస్తారన్నారు. అటువంటి రోజులు ఎంతో దూరంలో లేదని అన్నారు.

ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన వండర్ సిమెంట్ 7 క్రికెట్ మహోత్సవం సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 'ప్రస్తుతం క్రికెటర్ల మైండ్‌సెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. 35 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసేస్తున్నారు. మా రోజుల్లో ఇది సాధ్యం కాలేదు. భారత క్రికెట్‌లోని నాణ్యత ఏమిటో ఫలితాల బట్టే తెలుస్తోంది'అని కొనియాడాడు.

కోహ్లీ-సచిన్‌ మధ్య పోలిక గురించి మాట్లాడుతూ..'ఈ ఇద్దరి ఆటగాళ్లను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ఎవరికి వారే గొప్ప. ఎప్పుడైనా ఎవరైనా బాగా ఆడితేనే జట్టు విజయాలు సాధ్యపడతాయి. అప్పుడే క్రీడలోనూ అభివృద్ధి జరుగుతుంది' అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.

వన్డేల్లో త్రిశతకాలు సాధించడంపై అడిగిన ప్రశ్నకు 'త్రిశతకాలే ఎందుకు, త్వరలో ఏదో ఒక బ్యాట్స్‌మెన్‌ వన్డే క్రికెట్‌లోనే 400 బాదేస్తారు చూడండి అంటూ బదులిచ్చారు. ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆటగాళ్లు తమ గేర్లు మార్చుకుని చక్కగా రాణిస్తున్నారని తెలిపారు. తాము 1980ల్లో రోజంతా ఆడినా 280 పరుగులు సాధించడమే చాలా కష్టంగా ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు 20 ఓవర్లలోనే 280కి పైగా పరుగులు చేసేస్తున్నారు' అని వివరించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 15:36 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+