Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమిష్టింగా రాణించాలి: బాక్సిండ్ డే టెస్ట్‌కు ముందు సహచరులతో కోహ్లీ

Batsmen must step up collectively: Virat Kohli sends out loud message for batting unit ahead of 3rd Test

హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టులో బ్యాట్స్‌మెన్‌ తప్పక రాణించాల్సిందేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులోని సహచర ఆటగాళ్లకు సూచించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బుధవారం నుంచి ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "ఈ సారి బ్యాట్స్‌మెన్‌ రాణించడం ఎంతో ముఖ్యం. బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణిస్తుంది. చిన్న టార్గెట్‌లను కూడా చేధించకపోతే బౌలర్స్‌ ఏం చేయలేరు. రెండోసారి బ్యాటింగ్‌ చేస్తే ఆధిక్యం సాధించేందుకు, ప్రత్యర్థి స్కోరు సమం చేసేందుకు ప్రయత్నించాలి" అని కోహ్లీ అన్నాడు.

బాక్సింగ్ డే టెస్టులో కలిసికట్టుగా రాణించాలి

బాక్సింగ్ డే టెస్టులో కలిసికట్టుగా రాణించాలి

"లేకుంటే కనీసం ఆ స్కోర్‌ను సమం చేయడానికైనా కృషి చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో గెలపుకోసం ప్రయత్నించాలి. తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం భారీ స్కోర్లు సాధించి విజయావకాశాలను అందిపుచ్చుకోవాలి. దీనికోసం బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసికట్టుగా రాణించాలి. ఏ ఒక్కరో రాణించాలని చెప్పడం లేదు. ఒక జట్టుగా సిరీస్‌ 2-0, 0-2, 1-1 అని చూడను. గతానికి ప్రాముఖ్యం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. వర్తమానంలో ఉండి ఆడాలి. అలాగే కదా తొలి టెస్టు గెలిచింది" అని కోహ్లీ చెప్పాడు.

 1-1తో సిరిస్ సమం

1-1తో సిరిస్ సమం

నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో మూడో టెస్టును ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

పెర్త్ టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి

పెర్త్ టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి

స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకోకుండా నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా 146 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు స్వల్ప లక్ష్యాలను కూడా చేధించలేక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌ బాక్సింగ్ డే టెస్టు కోసం తుది జట్టులో మూడు మార్పులు చేసింది.

బాక్సింగ్ డే టెస్ట్ నుంచి ఓపెనర్లు ఔట్

బాక్సింగ్ డే టెస్ట్ నుంచి ఓపెనర్లు ఔట్

తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లను టీమ్‌లో నుంచి తొలగించింది. మరోవైపు పేస్‌ర్ ఉమేష్ యాదవ్‌ను కూడా తప్పించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు. గత రెండు టెస్టుల్లో ఓపెనర్లు జట్టుకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు మయాంక్‌ అగర్వాల్, హనుమ విహారిలను ఓపెనర్లుగా పంపించే యోచనలో ఉంది.

బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా

విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Tuesday, December 25, 2018, 18:15 [IST]
Other articles published on Dec 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+