క్రికెట్‌లో రెడ్‌కార్డ్: బ్యాట్ సైజుపై ఎంసీసీ కొత్త నిబంధనలివే
హైదరాబాద్: ఆటగాళ్ల బ్యాట్ సైజులో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం క్రికెట్ బ్యాట్ సైజు 108ఎంఎం వెడల్పు, 67ఎంఎం లోతు, ఇక బ్యాట్ ఎడ్జి 40ఎంఎంగా ఉండాలని సూచించింది.
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. ఎంసీసీ క్రికెట్ కమిటీ సిఫారసుల మేరకు కొత్త చట్టాలను అమలు చేయనున్నారు. 2000 సంవత్సరం తర్వాత మళ్లీ క్రికెట్‌లో కొత్త నిబంధలను అమల్లోకి తీసుకురానుంది.
దీంతో పాటు పుట్‌బాల్ మాదిరి క్రికెట్‌లో కూడా రెడ్‌కార్డుని ప్రవేశపెట్టనున్నారు. మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లను రెడ్‌కార్డ్‌తో బయటకు పంపే అధికారం ఫుట్‌బాల్‌లో రిఫరీకి ఉంటుంది. అలాగే క్రికెట్‌లోనూ అంపైర్‌కు అలాంటి అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు.
మైదానంలో ఆటగాళ్ల దురుసు ప్రవర్తన పెరిగిపోతుండటంతో కొత్త కోడ్ అమలు చేయడానికి ఇదే సరైన సమయమని, చాలా మంది అంపైర్లు దీని కారణంగానే గేమ్ వదలి వెళ్తున్నారని ఎంసీసీ హెడ్ జాన్ స్టీఫెన్‌సన్ అన్నారు. ఈ కొత్త కోడ్ ప్రకారం నాలుగు స్థాయిల్లో క్రికెటర్లకు జరిమానాలు విధించనున్నారు.
కొత్త కోడ్ నిబంధనలివే:

లెవెల్ 1
ఆటగాడు మితిమీరి అప్పీల్ చేయడం, అంపైర్ నిర్ణయంపై వ్యతిరేకత చూపడం లాంటి వాటిని లెవన్ 1 తప్పిదం కింద పరిగణిస్తారు. దీనికి ముందు అంఫైర్ హెచ్చరిక జారీ చేస్తారు. రెండోసారి లెవన్ 1 తప్పిదం చేస్తే పెనాల్టీ కింద ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు కేటాయిస్తారు.

లెవెల్ 2
ఇందులో ప్రత్యర్ధి ఆటగాడిపైకి బంతిని విసరడం, కావాలనే ఢీకొట్టడంలాంటివి లెవన్ 2 తప్పిదం కింద పరిగణిస్తారు. ఈ తప్పిదం చేస్తే వెంటనే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇచ్చేస్తారు.

లెవెల్ 3
అంపైర్ లేదా సహచర ఆటగాడు లేదా టీమ్ అధికారి లేదా ప్రేక్షకుడిని బెదిరించడం లాంటివాటిని లెవల్ 3 తప్పిదంగా పరిగణిస్తారు. ఈ తప్పిదం చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇవ్వడంతో పాటు ఆ ప్లేయర్‌ను అప్పుడు ఆడుతున్న ఫార్మాట్‌ను బట్టి కొన్ని ఓవర్లపాటు మైదానం నుంచి బయటకు పంపిస్తారు.

లెవెల్ 4
అంపైర్‌ను బెదిరించడం లేదా మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు హింసాత్మక చర్యలకు పాల్పడటంలాంటివి లెవల్ 4 తప్పిదం కిందకు పరిగణించారు. ఇలా చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇవ్వడంతోపాటు ఆ ఆటగాడిపై తదుపరి మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఆ సమయంలో ఆ ప్లేయర్ బ్యాటింగ్ చేస్తుంటే అతన్ని రిటైర్డ్ అవుట్‌గా కూడా ప్రకటిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications