Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సెంచరీతో వన్డే వైస్ కెప్టెన్‌కు మరో బ్రాండ్ ఆఫర్'

Bata announces Smriti Mandhana as the new brand ambassador for Power

హైదరాబాద్: ఫేం ఉంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు సెలబ్రిటీలు. అదే క్రికెట్‌లో అయితే ఫాంలో ఉంటే కొన్ని మ్యాచ్‌లలోనే అంబాసిడర్లు అయిపోతారు క్రికెటర్లు. తాజాగా మరోసారి ఆ విషయంలో చేరిపోయింది టీమిండియా వైస్ కెప్టెన్.

ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు సౌతాఫ్రికా జట్టుపై పరుగుల వర్షం కురిపిస్తోంది. ఇటు పురుషుల జట్టు, అటు మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది.
ఈ నేపథ్యంలోనే జట్టులోకి చేరిన అతి తక్కువ వయస్కురాలు అయిన స్మృతి మందాన ఏ మాత్రం తగ్గకుండా సీనియర్లతో పాటు స్కోరును సాధిస్తోంది.

బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మందాన సూపర్‌ సెంచరీతో చెలరేగింది. అప్పుడు ప్రపంచకప్‌లోనూ ఇదే హవాను కొనసాగించిన స్మృతి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో బ్రాండింగ్‌ అవకాశం దక్కించుకున్న భారత మహిళా క్రికెటర్ల జాబితాలో తాజాగా స్మృతి మంధాన కూడా చేరింది. ఇటీవలే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో సియట్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది.

స్మృతి ప్రముఖ పాదరక్షల ఉత్పత్తుల సంస్థ 'బాటా'తో చేయి కలిపింది. ఇక బాటాకు చెందిన స్పోర్ట్స్‌ బ్రాండ్‌ 'పవర్‌'కు 21 ఏళ్ల స్మృతి త్వరలోనే ప్రచారం మొదలుపెట్టనుంది. 'పవర్‌'కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం పట్ల స్మృతి సంతోషం వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి సందీప్‌ కటారియా మాట్లాడుతూ స్మృతితో కలిసి నడవడం 'బాటా' విలువను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 11:49 [IST]
Other articles published on Feb 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+