Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: 'రేయ్.. బుద్ధి మార్చుకో.. లేదంటే పృథ్వీ షా గతి పడుతుంది'

IPL 2025 Yashasvi Jaiswal : కెరీర్ ప్రారంభంలో మెరుపులు మెరిపించినా టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌.. ఇప్పుడు ఆ రేంజ్ ఫామ్ చూపించడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న అతడు.. భారీ ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. తొలి మూడు మ్యాచుల్లో 1,29,4 చేసి నిరాశపరిచిన అతడు నాలుగో మ్యాచులో మాత్రం 67 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. కానీ తాజాగా జరిగిన ఐదో మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై మళ్లీ కేవలం 6 పరుగులే చేసి విఫలమయ్యాడు.

అతడిలాగే నీ పరిస్థితి కూడా...
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ.. యశస్వి జైశ్వాల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. '' అతడి కడుపు నిండిపోయింది. ప్రస్తుతం అతడు క్రికెట్ పై ఫోకస్ చేయట్లేదు. ఇది నా ఓపెన్ మెసేజ్. క్రికెట్ లో ఇలానే ఉంటే భవిష్యతులో చాలా ఏడ్వాల్సి వస్తుంది. ఓసారి పృథ్వీషాను చూడు. పరిస్థితి అర్థమవుతుంది. క్రికెట్‌ను ప్రేమించు. ప్యాషన్ తో ఆడు.'' అని బాసిత్‌ అలీ ముందస్తు హెచ్చరికలు చేశాడు.

Basit Ali warns Yashasvi Jaiswal see at Prithvi Shaw and focus on cricket with love and passion

కోహ్లీ, రోహిత్ మంచి పని చేశారు..
ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌ ప్రకటించడం గురించి కూడా బాసిత్‌ అలీ కీలక కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కోహ్లీ అంత తొందరగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకోలేదు. కానీ అది సరైన నిర్ణయమే. '' అని వ్యాఖ్యానించాడు.

ఎన్నో స్థానంలో అంటే..
కాగా, యశస్వి జైశ్వాల్ ప్రాతినిధ్య వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే.. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే గెలిచింది. నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Thursday, April 10, 2025, 15:18 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+