ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది భారత్. ఫైనల్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే అతడిపై పలువురు ప్రశంసలు కురిపించగా.. మరికొంతమంది మాత్రం హిట్‌మ్యాన్‌ను పట్టించుకోలేదు! ఆఖరికి ఐసీసీ కూడా ప్రకటించిన జట్టులో రోహిత్ కు చోటు ఇవ్వలేదు. కానీ పాకిస్థానీ క్రికెటర్ మాత్రం రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనను గుర్తించాడు. టీమిండియాకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఆ పాకిస్థాన్ క్రికెటర్ మాత్రం తన జట్టులో రోహిత్ కు చోటు కల్పించి కెప్టెన్ గా ఎంపిక చేశాడు.{image-
rohiiii600x338-1741938060.jpg telugu.mykhel.com}
అతడెవరంటే?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ చేసిన ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. జట్టును ప్రకటించి అందులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మను సెలెక్ట్ చేశాడు. ఇతర దేశాల ప్లేయర్లను తన జట్టులోకి తీసుకున్నాడు. కానీ పాకిస్థాన్ ప్లేయర్లు ఒక్కరిని కూడా తీసుకోకపోవడం గమనార్హం.
"ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఆటగాడు అయితే బాగా ఆడాడని అనిపించింతో వారితోనే తుది జట్టును ఎంపిక చేశాను. ఐసీసీ జట్టుతో సరిపోల్చడం లేదు. నా జట్టు కెప్టెన్ రోహిత్. టోర్నీలో కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు. ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ గతినే మార్చేశాడు." అని ప్రశంసలు కురిపించాడు.
బసిత్ అలీ ప్రకటించిన జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ శాంట్నర్, షమీ, హెన్రీ, వరుణ్ చక్రవర్తి