For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డికాక్ ఊచకోత.. విధ్వంసకర సెంచరీ (Video)

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ విధ్వంసం నెలకొల్పాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డికాక్.. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో ఊచకోతకు దిగాడు. 68 బంతుల్లోనే 115 పరుగులు బాదాడు. కరేబియన్ లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

డికాక్ మెరుపు సెంచరీతో బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అయితే ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆదిలో నిలకడగా ఆడాడు. మరో ఓపెనర్ కదీమ్ (22; 9 బంతుల్లో, 2 ఫోర్లు, 2 ఫోర్లు) దూకుడుకు సహకరించాడు. కదీమ్ ఔటైన అనంతరం డికాక్ బాదే బాధ్యతను అందుకున్నాడు.

Barbados Royals vs Guyana Amazon Warriors De Kock s Maiden CPL Century Propels Royals to the Top

సహచరులు వెనుదిరుగుతున్నా డికాక్ బౌండరీలతో హోరెత్తించాడు. ఆఖరి ఓవర్‌ వరకు క్రీజులో ఉండి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. చివర్లో హోల్డర్ (28 నాటౌట్; 10 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గయానా బౌలర్లలో ఆర్ రిఫర్ మూడు వికెట్లు, ప్రిటోరియస్ రెండు వికెట్లు తీశారు. కాగా, అనంతరం ఛేదనకు దిగిన గయానా అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 173 పరుగులే చేసింది. 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

కెప్టెన్ షై హోప్ (40; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మొయిన్ అలీ (33; 19 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కీమో పాల్ (30; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), హెట్‌మెయిర్ (28; 10 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు చేశారు. బార్బడోస్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు, హోల్డర్ రెండు వికెట్లు తీశారు.

ఛేదన ఆరంభంలోనే గయానా వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే లోపే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్‌మెయిర్‌తో కలిసి హోప్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ బార్బడోస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పైచేయి సాధించారు.

Story first published: Sunday, September 15, 2024, 12:56 [IST]
Other articles published on Sep 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+