Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆస్ట్రేలియా జట్టుకు స్మిత్ అవసరం చాలా ఉంది'

Banned Steve Smith likely to be welcomed back, says Waugh

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్టీవ్‌స్మిత్ అవసరం ఎంతైనా ఉందని మాజీ కెప్టెన్ స్టీవ్‌వా అన్నాడు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బంతిని ట్యాంపరింగ్ చేసినందుకు స్మిత్‌తో పాటు వార్నర్, బాన్‌క్రాఫ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్‌వా ఫాక్స్ స్పోర్ట్స్‌తో స్పందించాడు. అద్భుత ప్రతిభ కల్గిన స్మిత్ లాంటి ఆటగాన్ని మరొకరితో భర్తీ చేయలేమని తెలిపాడు.

చేసిన తప్పునకు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ పశ్చాత్తాపపడుతున్నారని అభిప్రాయపడ్డాడు. వాళ్లు చేసిన తప్పును ఆస్ట్రేలియా ప్రజలు మన్నిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ అంటే పడిచచ్చే స్మిత్ పునరాగమనంలో అంతే స్థాయిలో పరుగులు కొల్లగొట్టాలని పిలుపునిచ్చాడు. ఆస్ట్రేలియాకు కావాల్సింది ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఏడాది తర్వాత జట్టులోకి వచ్చి గతంలో లాగా రాణించడం అందరూ అనుకున్నంత సులువు కాదు అని స్టీవ్‌వా అన్నాడు.

ప్రస్తుతం సదర్‌లాండ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మిత్ శనివారం మోస్‌మన్ జట్టుతో ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. స్మిత్‌తో పాటుగా నిషేదానికి గురైన మరో ఇద్దరు క్రికెటర్లు వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు కూడా పునరాగమనం చేయాలని భావిస్తున్నాను.

అందరూ అనుకున్నట్లు 12 నెలలుగా జట్టుకు దూరమై మళ్లీ అంతటి ఫామ్ సాధించడం కష్టమేనని పేర్కొన్నాడు. ఎందుకంటే వాళ్ల మీద వాళ్లకే అనుమానం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. నిషేదం పూర్తి అయ్యాక వచ్చినా.. పూర్తి కాకుండానే జట్టులో ఆడినా వారి తిరిగి అంతటి ఫామ్‌ను సంపాదించడమనేది ఛాలెంజ్‌తో కూడిన విషయం.

Story first published: Wednesday, September 19, 2018, 11:56 [IST]
Other articles published on Sep 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+