Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్లోబల్ టీ20: నిషేధిత డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు!

Banned David Warner handed Winnipeg captaincy

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. అదేంటీ నిషేధం ఎదుర్కొంటొన్న డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడమా? అని అశ్చర్యపోతున్నారా?

అయితే, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేది ఆస్ట్రేలియా జట్టుకు కాదు. డేవిడ్ వార్నర్‌ ప్రస్తుతం కెనడాలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. డ్వేన్‌ బ్రావో నాయకత్వంలోని విన్నిపెగ్‌ హాక్స్‌ జట్టులో వార్నర్ సభ్యుడిగా ఉన్నాడు.

అయితే, గాయం కారణంగా బ్రావో మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీని అప్పగించే యోచనలో ఉంది. ఈ సందర్భంగా ఆ జట్టు కోచ్‌ వకార్‌ యూనిస్‌ మాట్లాడుతూ "కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ సరైన ఛాయిస్‌. ఐపీఎల్‌లో అతని కెప్టెన్సీ చూశాను" అని అన్నాడు.

"సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు నాయకత్వం వహిస్తూనే బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఆ అనుభవంతోనే అతడికి ఈ లీగ్‌లో కలిసి వచ్చే అవకాశం ఉంది" అని వకార్ యూనిస్ తెలిపాడు. మరోవైపు జట్టు యాజమాన్యం కూడా డేవిడ్ వార్నర్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే భావనతో ఉంది.

కాగా, ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్‌ వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిషేధాన్ని ఏమైనా తగ్గించే యోచనలో ఉన్నారా? అని సీఏని ఓ విలేకరి ప్రశ్నించగా "అలాంటిది ఏమీలేదు. సీఏ ఒకసారి ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు" అని పేర్కొంది.

Story first published: Thursday, July 5, 2018, 10:04 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+