Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ కెప్టెన్‌గా తీసుకోనున్న జట్టు యాజమాన్యం

Banned Australia cricketer David Warner handed Winnipeg Hawks’ captaincy

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడంతో అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇలా నిషేధం ఎదుర్కొంటున్న డేవిడ్‌ వార్నరే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. అయితే అది ఆసీస్‌ జట్టుకు కాదు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న వార్నర్.. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు.

డ్వేన్‌ బ్రావో నాయకత్వంలోని విన్నిపెగ్‌ హాక్స్‌ జట్టులో సభ్యుడు వార్నర్‌. ఐతే, గాయం కారణంగా బ్రావో మొత్తం టోర్నమెంట్‌కే దూరమయ్యాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ ఎంపిక వేటలో పడింది. ఇదే లీగ్‌లో వార్నర్ పెద్దగా రాణించలేకపోయినా.. కోచ్ నిర్ణయం అతనికి అనుకూలంగానే ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో వార్నర్ వరుసగా 1, 4, 1 స్కోరు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఈ సందర్భంగా ఆ జట్టు కోచ్‌ వకార్‌ యూనిస్‌ మాట్లాడుతూ... 'కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ సరైన ఛాయిస్‌. ఐపీఎల్‌లో అతని కెప్టెన్సీ చూశాను. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు నాయకత్వం వహిస్తూనే బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఆ అనుభవంతోనే అతడికి ఈ లీగ్‌లో కలిసి వచ్చే అవకాశం ఉంది' అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరోపక్క జట్టు యాజమాన్యం కూడా వార్నర్‌కే పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని సమాచారం. బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్‌ వార్నర్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా నిషేధాన్ని ఏమైనా తగ్గించే యోచనలో ఉన్నారా అని సీఏని అడగ్గా.. అలాంటిది ఏమీలేదు. సీఏ ఒకసారి ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు అని తెలిపింది. ఈ ట్యాంపరింగ్ వివాదంతోనే ఐపీఎల్ నిర్వహక సంఘం కూడా వార్నర్‌ను లీగ్‌కు దూరంగా ఉంచింది.

Story first published: Thursday, July 5, 2018, 18:12 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+