న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 world Cup 2022: ఉత్కంఠ పోరులో బంగ్లాను వరించిన విజయం.. పోరాడి ఓడిన జింబాబ్వే..

 Bangladesh won by 3 runs against Zimbabwe in T20 world Cup 2022

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో జింబాబ్వే పై బంగ్లాదేశ్ 3 పరుగులు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ నే విజయం వరించింది.మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

శాంటో హాఫ్ సెంచరీ

శాంటో హాఫ్ సెంచరీ

బంగ్లా ఓపెనర్ శాంటో హాఫ్ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ డకౌట్ కాగా.. కెప్టెన్ షకీబుల్ హసన్ 23, హుస్సేన్ 29 పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ రెండేసి వికెట్ల పడగొట్టగా.. రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు

సీన్ విలియమ్స్

సీన్ విలియమ్స్

151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్, తక్కువ పరుగులకే ఔటయ్యారు. తర్వాత వచ్చిన మిల్టన్ శుంబా త్వరగా పెవిలియన్ చేరాడు. సీన్ విలియమ్స్ జట్టును ఆదుకున్నాడు. జట్టును గెలిపించే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. విలియమ్స్ 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు చేశాడు.

తస్కిన్ అహ్మద్

తస్కిన్ అహ్మద్

ర్యాన్ బురి 25 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 27 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ రెగిస్ చకబ్వా 15 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్ల తీయగా.. హుస్సేన్, రెహ్మన్

రెండేసి వికెట్లు పడగొట్టారు.

రెండో స్థానం

రెండో స్థానం

గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్, నెదర్లాండ్స్ విజయం సాధించింది. కాగా సౌతాఫ్రికా మూడు పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరింది.

Story first published: Sunday, October 30, 2022, 12:15 [IST]
Other articles published on Oct 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X