Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాపై విజయం, దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌పై భువనేశ్వర్

Bangladesh win a big boost but India yet to finalise plan against SA: Bhuvneshwar

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేస్ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ధోని(113), కేఎల్ రాహుల్ (108) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కాగా, అంతకముందు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీసేన ఓడింది. ఈ నేపథ్యంలో రెండో వార్మప్ మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ "బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా సరే వారి అద్భుత ప్రదర్శన చేశారు. వరల్డ్‌కప్‌లో బాగా ఆడడానికి ఈ విజయం ఆత్మవిశ్వాన్నిస్తుంది" అని అన్నాడు.

"వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీలో ఆటను గెలుపుతో ప్రారంభించాలని భావిస్తాం. అయితే, ఈ టోర్నీలో మొదటి మ్యాచ్‌ ఆడడానికి మాకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. గెలుపుకోసం మా ప్రణాళిక ఏంటో ప్రస్తుతం నేను చెప్పలేను. మేము ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, టీమ్ సమావేశాల్లో సఫారీలతో ఎలా ఆడాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం" అని భువీ అన్నాడు.

టోర్నీలో భాగంగా కోహ్లీసేన సౌతాంప్టన్ వేదికగా జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించడం కూడా చాలా ముఖ్యమని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు. "వరల్డ్‌కప్ టోర్నీ చాలా పెద్ద వేదిక. ఒత్తిడి ఉంటుంది. కానీ, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గతంలో కూడా ఇంగ్లండ్‌లో ఆడాను.. ఇక్కడి పరిస్థితులు గురించి అవగాహన ఉంది" అని చెప్పాడు.

Story first published: Wednesday, May 29, 2019, 17:26 [IST]
Other articles published on May 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+