Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bangladesh vs West Indies: ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన స్పిన్నర్‌!!

Bangladesh vs West Indies: Mehidy Hasan Miraz hits maiden century in No. 8 batting position

చిట్టగాంగ్‌: ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహదీ హసన్ మిరాజ్‌ (103; 168 బంతుల్లో 13×4) సెంచరీ చేశాడు. ఇదే అతనికి తొలి టెస్ట్ సెంచరీ. 8వ స్థానంలో లేదా అంతకంటే దిగువన వచ్చి సెంచరీ చేసిన ఆరో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా మెహదీ హసన్ రికార్డుల్లోకి ఎక్కాడు. మెహదీ హసన్ సెంచరీ చేయడంతో వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 242/5తో రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌.. లిటన్‌ దాస్‌ (38) వికెట్‌ త్వరగా కోల్పోయినా షకిబ్‌ అల్‌ హసన్‌ (68)తో కలిసి మెహదీ హసన్ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. షకిబ్‌ జతగా ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించిన మెహదీ.. తైజుల్‌ ఇస్లాం (18)తో ఎనిమిదో వికెట్‌కు 45 పరుగులు చేశాడు. ఇక నయీం (24)తో తొమ్మిదో వికెట్‌కు 67 పరుగులు జత చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 99 బంతుల్లో అర్ధసెంచరీ చేరుకున్న ఈ స్పిన్నర్‌.. 160 బంతుల్లో కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో వారికన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ ఆట ఆఖరికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. స్టార్ పేసర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (2/18) విజృంభించడంతో 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (49), అరంగేట్ర ఆటగాడు బోనర్‌ (17) మరో వికెట్‌ పడకుండా ఆటను ముగించారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న కరీబియన్లు.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 355 పరుగులు వెనుకబడి ఉన్నారు. బ్రాత్‌వైట్‌ (49), బూనర్‌ (17) క్రీజులో ఉన్నారు.

Story first published: Friday, February 5, 2021, 8:17 [IST]
Other articles published on Feb 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+