
184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని
ఢాకా వేదికగా 3 రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో అన్ని విభాగాల్లోనూ సత్తాచాటిన బంగ్లాదేశ్ ఏకంగా ఇన్నింగ్స్ 184 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకోగలిగింది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగులకి ఆలౌటైంది.

సెంచరీకి మించిన స్కోరు చేసిన మహ్మదుల్లా
బంగ్లా జట్టులో మహ్మదుల్లా (136) 242 బంతుల్లో 10ఫోర్లతో సెంచరీని మించిన స్కోరు చేయగా.. ఓపెనర్ షాదమన్ ఇస్లామ్ (76) 199 బంతుల్లో 6ఫోర్లతో క్రీజులో పాతుకుపోయాడు. ఇక కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (80) 139 బంతుల్లో 6ఫోర్లు, లిట్టన్ దాస్ (54) 62 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సుతో రాణించారు.

36.4 ఓవర్లలోనే 111 పరుగులకి కుప్పకూలి
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు.. బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ (7/58) ధాటికి 36.4 ఓవర్లలోనే 111 పరుగులకి కుప్పకూలిపోయింది. దీంతో.. ఫాలో ఆన్ ఆడిన కరీబియన్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయారు. మరోసారి మెహిదీ హసన్ (5/59) మాయ చేయడంతో ఆ జట్టు 59.2 ఓవర్లలో 213 పరుగులకి చేతులెత్తేసింది.

తొలి టెస్టులోనూ 64 పరుగుల తేడాతో
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హిట్‌మెయర్ (39, 93) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. తొలి టెస్టులోనూ 64 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్ జట్టు.. రానున్న ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ని వెస్టిండీస్‌తో ఆడనుంది.


Click it and Unblock the Notifications












