న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: బంగ్లా-లంక మ్యాచ్.. వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

Bangladesh vs Sri Lanka match toss delayed by rain

ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్ వేసే సమయానికి మైదానంలో వర్షం పడింది. దీంతో అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. అయితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున.. సుమారు గంట తర్వాత పిచ్ పరిస్థితి సమీక్షించి టాస్‌ వేసే అవకాశం ఉంది. ఒకవేళ మళ్లీ భారీ వర్షం పడితే నిన్నటి ఫలితమే ఈ రోజు కూడా రానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. సోమవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దవడంతో ప్రొటీస్ సెమీస్‌ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. అంతకుముందు శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే లంకకు వరణుడు అడ్డుపడడం రెండోసారి అవనుంది.

ప్రపంచకప్‌లో శ్రీలంక మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒకదాంట్లో విజయం సాధించి మరొక దాంట్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. మరోవైపు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక విజయం సాధించి రెండింట్లో ఓడిపోయింది. పటిష్ట దక్షిణాఫ్రికాను ఓడించినా.. కివీస్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయింది. ఓడినా కూడా బంగ్లా భారీ పరుగులే చేసింది. ఈ రోజటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. మరి వర్షం ఏం చేస్తుందో చూడాలి.

ఇప్పటివరకు లంక, బంగ్లాలు 43 వన్డేలు ఆడాయి. వీటిలో 36 లంక గెలిస్తే.. 7 బంగ్లా నెగ్గింది. ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లో లంకే గెలిచింది. రికార్డులు లంకకు అనుకూలంగా ఉన్నా.. లంక పరిస్థితి ఇపుడు ఏమంత బాగాలేదు. లంక బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తడబడుతుండడంతో.. బంగ్లాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది.

Story first published: Tuesday, June 11, 2019, 15:38 [IST]
Other articles published on Jun 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X