
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దైంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో మొదటి వారం రోజులు జరిగిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మజాను పంచాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఆ తర్వాత నుంచి వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ సైతం రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
వర్షంతో రద్దైన మూడో మ్యాచ్‌గా ఇది నిలిచింది. వరల్డ్‌కప్ చరిత్రలోనే వర్షం కారణంగా అత్యధిక మ్యాచ్‌లు రద్దైన వరల్డ్‌కప్‌గా 2019 వరల్డ్‌కప్ నిలిచింది. 1979, 2015 వరల్డ్ కప్‌లో వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కాగా... ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం గం.3.00ని.లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు సైతం వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు. పిచ్‌తో పాటు ఔట్ ఫీల్డ్‌ను కూడా కవర్లతో కప్పి ఉంచారు. వర్షాలు ఇలానే పడితే పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
సౌతాంప్టన్ వేదికగా సోమవారం దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో సఫారీలు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. అంతకముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడటం... ఇప్పుడు మరో మ్యాచ్ రద్దు కావడం సఫారీలకు శాపంగా మారింది.
అంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా గురువారం జరిగే ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది.
గత రెండు రోజులుగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. బర్మింగ్‌హామ్, పీటర్‌బొరో, న్యూ క్యాజిల్ సహా ఇంగ్లాండ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.