Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BAN vs NZ: రావల్పిండిలో పరుగుల వర్షం కురుస్తుందా?.. మ్యాచ్ పిచ్ రిపోర్టు ఇదే..

BAN vs NZ Pitch Report: ఛాంపియన్స్ ట్రోఫీలో సోమవారం న్యూజిలాండ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ లో భారీ విజయంతో ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు.. సోమవారం రావల్పిండిలో బంగ్లాదేశ్ తో తలపడనుంది. న్యూజిలాండ్ జట్టు తన తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టును 60 పరుగుల తేడాతో ఓడించి గొప్ప ఆరంభం ఇచ్చింది. ఈ విజయం కారణంగా న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది.

బంగ్లాదేశ్ పై కివీస్ జట్టు గెలిస్తే సెమీస్ కు చాలా దగ్గరగా చేరుకుంటారు. భారత్ తో మ్యాచ్ లో ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు.. అవకాశాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే గెలవడం చాలా ముఖ్యం. బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ చాలా పేలవంగా ఉంది. సెమీ-ఫైనల్ కు చేరుకునే రేసులో కొనసాగాలంటే బంగ్లాదేశ్ ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ లో పిచ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Bangladesh vs New Zealand Match Rawalpindi Stadium Pitch Report

న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ పిచ్ రిపోర్టు
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆరో మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రావల్పిండి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. అయితే ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కూడా బాగా సహకరిస్తుంది. ఈ మ్యాచ్ లో అధిక స్కోరింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు రావల్పిండి స్టేడియంలో మొత్తం 26 మ్యాచ్ లు జరగగా.. వాటిలో 11 మ్యాచ్ లను ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలుచుకుంది. 14 మ్యాచ్ లను ముందుగా బౌలింగ్ చేసిన జట్టు గెలుచుకుంది. ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 242 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 213 పరుగులు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇరు జట్లు ఇలా...

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్) మైఖేల్ బ్రేస్ వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ ఢఫీ.

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్మదుల్లా, జకార్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, నసూమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్, హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్మదుల్లా, జకార్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.

Story first published: Monday, February 24, 2025, 13:56 [IST]
Other articles published on Feb 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+