'భారత్ బలమైన జట్టు': హైదరాబాద్ చేరిన బంగ్లా జట్టు
హైదరాబాద్: భారత్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. గురువారం సాయంత్రం కోల్‌కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. సాయంత్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జట్టు సభ్యులు నేరుగా తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్లిపోయారు.
ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ముష్ఫికర్ రహీమ్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో ఈనెల 5, 6 తేదీల్లో భారత-ఎ జట్టుతో రెండురోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనుంది.

భారత్‌లో ఆడుతున్న తొలి టెస్టు
2000లో ఐసీసీ నుంచి టెస్టు క్రికెట్ హోదా పొందిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ భారత్‌తో ఏకైక టెస్టులో మెరుగైన ప్రదర్శన చేస్తామని అన్నాడు. ఏకైక టెస్టులో ‘మేం ఏం చేయగలమో ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం' అని అన్నాడు.

చారిత్రక టెస్టు అని భావించడం లేదు
‘కొంత ఆశ్చర్యంగా ఉంది. ఇది చారిత్రక టెస్టు అని నేనైతే భావించడం లేదు. జింబాబ్వేతో మ్యాచ్ అన్నప్పుడు మాపై ఎంతో ఒత్తిడి నెలకొంటుంది. ఒకవేళ ఓడితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇప్పుడు భారత పర్యటనకు వెళ్లడం మంచిదనే అనుకుంటున్నాను' అని రహీమ్ అన్నాడు.

భారత బలమైన జట్టు
‘భారత బలమైన జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందునా సొంతగడ్డపై వారి ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. కానీ సమష్టిగా ఆడితే మెరుగైన ఫలితాలు దక్కుతాయి. రెండు, మూడు రోజులు కాదు, ఐదు రోజులపాటు పోరాడాలనే పట్టుదలతో ఉన్నాం' అని ముష్ఫికర్ అన్నాడు. తమ జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు.

మిగతా టెస్టుల్లాగే దీనిని పరిగణిస్తున్నాం
'పరిస్థితులు ఎలా ఉన్నా మాకేమీ ఇబ్బంది లేదు. భారత్‌లో ఎంత బాగా ఆడగలమో క్రికెట్ ప్రపంచానికి చాటాలనుకుంటున్నాం. ఎన్నేళ్ల తర్వాత మేం భారత్‌కు వెళ్తున్నామో నాకు తెలియదు. కానీ భారత్ మమ్మల్ని మళ్లీ మళ్లీ ఆహ్వానించేలా ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌ను కూడా మిగతా అన్ని టెస్టుల్లాగే పరిగణిస్తాం' అని ముష్ఫికర్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications