For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో టెస్టు: నేడు జట్టు ఎంపిక, విద్యార్థులకు ఉచిత ప్రవేశం

బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్న ఏకైక టెస్టులో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్‌ సాహాకు చోటు దక్కే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయ

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్న ఏకైక టెస్టులో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్‌ సాహాకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు అనంతరం ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన సాహా తాజాగా గుజరాత్‌తో ముగిసిన ఇరాన్ కప్‌లో డబుల్ సెంచరీ సాధించి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 31)న బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశమయ్యే సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యుల బృందంలో సాహాకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సాహాతో పాటు జయంత్ యాదవ్, రహానే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.

షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే ఇండియా ఏ జట్టును సైతం శనివారం బీసీసీఐ ప్రకటించింది. తమిళనాడు కెప్టెన్ అభినవ్ ముకుంద్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Bangladesh Test: India squad to be announced on January 31

ఇంగ్లాండ్ సిరిస్‌లో గాయపడిన ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండ్‌తో మొహాలిలో ముగిసిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన బంగ్లాదేశ్ హైదరాబాద్ నగరానికి రానుంది.

రెండు రోజుల విశ్రాంతి ఆ తర్వాత ట్రైనింగ్‌, అనంతరం భారత్ ఏ జట్టుతో 5,6 తేదీల్లో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరగనుంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ ఉప్పల్‌‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో టీమిండియా బంగ్లా టెస్టు మ్యాచ్‌ ఆడనుంది.

బంగ్లా టెస్టుకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌కు పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు హెచ్‌సీఏ తెలిపింది. ఈ మ్యాచ్‌కు హాజరయ్యే విద్యార్థుల వివరాలను సదరు పాఠశాల యాజమాన్యం వచ్చేనెల 1వ తేదీన జింఖానా మైదానంలో హెచ్‌సీఏ ప్రతినిధికి అందజేయాలని హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+