న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా బలవంతంగా అప్పగించారు.. ఇదొక ఊహించని పరిణామం'!!

Bangladesh Test captain Mominul Haque says Iam not ready for captaincy, it was totally unexpected

ఢాకా: నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా బలవంతంగా అప్పగించారు. ఇదొక ఊహించని పరిణామం అని బంగ్లాదేశ్‌ టెస్ట్ ఫార్మాట్‌ కొత్త కెప్టెన్ మోమినల్‌ హక్‌ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ షకిబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో షకిబుల్‌ స్థానాన్ని బీసీబీ కొత్తవారితో భర్తీ చేశారు. టీ20 ఫార్మాట్‌కు మహ్మదుల్లాను.. టెస్టులకు మోమినల్‌ హక్‌ను కెప్టెన్‌లుగా నియమించింది.

అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు: స్మిత్ ఆటలో నో స్టైల్‌, నో టెక్నిక్‌!!అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు: స్మిత్ ఆటలో నో స్టైల్‌, నో టెక్నిక్‌!!

మోమినల్‌ హక్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్సీపై స్పందించాడు. 'నేను ఎప్పుడూ కెప్టెన్సీ గురుంచి ఆలోచించలేదు. కెప్టెన్సీ చేయాలనే ఆలోచన కూడా నాకు లేదు. బంగ్లా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని ఏ రోజూ ఊహించలేదు. నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా.. ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. బీసీబీ బలవంతంగానే కెప్టెన్సీని ఇచ్చింది. ఇక నా ముందున్న లక్ష్యం జట్టును సమర్ధవంతంగా నడిపించడమే. అల్లా దయవల్ల కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది' అని మోమినల్‌ పేర్కొన్నాడు.

'కెప్టెన్సీ కారణంగా అదనపు ఒత్తిడి ఉంటుందని నేను అనుకోవడంలేదు. ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం కచ్చితంగా ఒత్తిడి లోనవుతాం. ఇంతకుముందు ఎలా స్వేచ్ఛగా ఆడానో.. అదే తరహా ప్రదర్శనను చేయడానికి యత్నిస్తా. ఒక బ్యాట్స్‌మన్‌ గానే పరుగులు చేస్తా. బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా చేయడం ఒక గొప్ప అవకాశం. అయితే భారత్‌తో డే అండ్‌ నైట్‌ టెస్టులో ఆడటం ఇంకా గౌరవంగా భావిస్తున్నా. ఇక మేము మంచి క్రికెట్ ఆడగలిగితే అది చాలా బాగుంటుంది' అని మోమినల్‌ అన్నాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌ గురువారం (నవంబర్ 7) రాజ్‌కోట్‌లో జరుగుతుంది. నవంబర్ 10న నాగపూర్ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. ఇక నవంబర్ 14 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్‌ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌లు తొలిసారి డేనైట్‌ టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, November 7, 2019, 16:29 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X