Mominul Haque Quits Test Captaincy: బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రకంపనలు, కెప్టెన్సీకి బై బై చెప్పిన మోమినుల్

బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రకంపనలు రేగాయి. ఉన్నట్టుండి ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ రాజీనామా ప్రకటించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ ఈ సంవత్సరంలో పేలవమైన ఫామ్ కనబర్చుతున్నాడు. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి అతను మంగళవారం టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు చెప్పాడు.
ఇక బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఇంట్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్‌లతో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని మోమినుల్ వెల్లడించాడు. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి తర్వాత అతని బ్యాటింగ్ పట్ల తీవ్ర విమర్శలొచ్చాయి. వచ్చే నెలలో బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు అతను రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జట్టును నడిపించలేకపోతున్నా
'నేను కెప్టెన్‌గా జట్టుకు సహకారం అందించలేకపోతున్నాను. జట్టును ప్రోత్సహించడంలో కూడా విఫలమవుతున్నాను. కాబట్టి నా స్థానంలో వేరొకరికి బాధ్యత అప్పగిస్తే మంచిదని నేను భావిస్తున్నాను' అని మోమినుల్ విలేకరులతో తెలిపాడు. నేను నా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టగలిగితే అది నాతో పాటు జట్టుకు కూడా మంచిదని తలుస్తున్నా.
ఇకపోతే 2022లో మోమినుల్ ఆరు టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అలాగే కేవలం 162పరుగులు మాత్రమే సాధించాడు. జనవరిలో మౌంట్ మాన్‌గనుయ్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ 8వికెట్ల తేడాతో గెలిచిన మ్యాచ్‌లో 88పరుగులు చేసిన మోమినుల్ ఆ తర్వాత తన ఫామ్ కోల్పోయాడు.

అతను కెప్టెన్సీని వదులుకోవడమే కరెక్ట్
ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 11పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్ ఈ సిరీస్ 0-1తేడాతో ఓడిపోయింది. బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ అతని కెప్టెన్సీని కొనసాగించాలని అభ్యర్థించినప్పటికీ మోమినుల్ మాత్రం తన అయిష్టతను వ్యక్తం చేశాడు.
మోమినుల్ మెంటర్, కోచ్ నజ్ముల్ అబెదిన్ ఫాహిమ్ మాట్లాడుతూ.. 'కెప్టెన్సీ కొంతవరకు అతని బ్యాటింగ్‌ను ప్రభావితం చేసింది. కాబట్టి, అతను బ్యాట్స్‌మెన్‌గా తిరిగి ఫామ్‌లోకి రావాలని, అందుకు కెప్టెన్సీ భారాన్ని వదిలించుకోవడం సమంజసమేనని భావిస్తున్నా' అని తెలిపాడు.

2019లో కెప్టెన్సీ పగ్గాలు
మోమినుల్ 53 టెస్టుల్లో 11సెంచరీలతో 3,525పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మోమినుల్ హకే. వెస్టిండీస్ పర్యటన కోసం మోమినుల్‌ను బీసీసీ టెస్ట్ కెప్టెన్‌గా తొలుత ప్రతిపాదించినా.. మోమినుల్ రాజీనామా చేయడంతో షకీబ్ అల్ హసన్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి నియమిస్తారని ఊహాగానాలొస్తున్నాయి.
షకీబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించిన తర్వాత నవంబర్ 2019లో మోమినుల్ షకీబ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇకపోతే జూన్ 5న బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌కు బయలుదేరుతుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications