Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్

Bangladesh Star Player Tamim Iqbal Retired From T20I Format

బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతను తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇకపోతే తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెలిచి వెస్టిండీస్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా తమీమ్ ఇక్బాల్ నిలిచాడు. ఇక మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించాడు. 33ఏళ్ల తమీమ్ ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంప్రదించిన తర్వాత టీ20ల నుంచి రిటైర్మెంట్‌కు ప్లాన్ చేసుకున్నాడు. ఇకపోతే అప్పటి నుంచి బంగ్లాదేశ్ తరపున టీ20ల్లో అతను ఆడలేదు. అయితే అతను ఈ టైంలో దేశీయంగా టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 వరల్డ్ కప్ ముందు జట్టులో అతని స్థానంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అతను స్వచ్ఛందంగా తప్పుకోవడమే మేలని భావించాడు.

ఇటీవల అతని టీ20 కెరీర్ గురించి బంగ్లా క్రికెట్ బోర్డు అధికారులు తరచూ ప్రకటనలు చేయడం పట్ల తమీమ్ అసంతృప్తితో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20సిరీస్‌లోనూ అతను ఆడలేదు. ఇక ముందున్న టీ20 ప్రపంచకప్ ముందు ఇక తన ఎంపిక కష్టమేనని భావించిన తమీమ్.. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్లో అతను పోస్ట్ చేస్తూ.. 'నేను ఈరోజు నుంచి టీ20ల నుంచి రిటైర్ అయినట్లు భావించండి. అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.

ఇకపోతే 2007లో టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరపున 78 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 24.08సగటుతో 116.9 స్ట్రైక్ రేట్‌తో 1758పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. చాలా మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌కు బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కడానికి అతను కూడా ఓ ప్రధాన కారణం. ఇకపోతే వన్డే, టెస్టు ఫార్మాట్లలో తమీమ్ కొనసాగనున్నాడు.

Story first published: Sunday, July 17, 2022, 19:00 [IST]
Other articles published on Jul 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+