Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ సూపర్-8కు అర్హత సాధించింది. కింగ్స్ టౌన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తదుపరి దశకు క్వాలిఫై అయింది. బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్ హసన్ (17; 22 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.

టెయిలెండర్లు రిషాద్ (13; 7 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), తస్కిన్ అహ్మద్ (12 నాటౌట్; 15 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. సోంపాల్ (2/10), సందీప్ లమిచానె (2/17), రోహిత్ పాడెల్ (2/20), దీపేంద్ర సింగ్ (2/22) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.అనంతరం ఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. తన్జీమ్ (4/7) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మన్ (3/7) మూడు వికెట్లతో విజృంభించారు.

Bangladesh Sets Record for Lowest Target Successfully Defended in T20 World Cups

అయితే ఈ క్రమంలో బంగ్లాదేశ్ అరుదైన ఘనత సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. 107 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయడంలో యువ బౌలర్ తన్జీమ్ హసన్ సకీబ్ కీలక పాత్ర పోషించాడు. రెండు మెయిడిన్లతో పాటు ఏకంగా 21 బంతులకు పరుగులేమి ఇవ్వలేదు. కేవలం ఏడు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

కాగా, తక్కువ స్కోర్లను కాపాడుకున్న జాబితాలో తర్వాతి రెండు స్థానాల్లోనూ దక్షిణాఫ్రికానే ఉంది. బంగ్లాదేశ్‌పై 114 పరుగుల టార్గెట్‌ను, నేపాల్‌పై 116 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కాపాడుకుంది. ఇవన్నీ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లోనే నమోదవ్వడం గమనార్హం. ఇక నాల స్థానంలో శ్రీలంక (120 పరుగులు, న్యూజిలాండ్‌పై - 2014), అయిదో స్థానంలో భారత్ (120 పరుగులు, పాకిస్థాన్‌పై- 2024) ఉన్నాయి.

Story first published: Monday, June 17, 2024, 10:33 [IST]
Other articles published on Jun 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+