Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తు- వైట్ వాష్: అతడే హీరో

పాకిస్తాన్ కు వరుస పరాజయాల బెడద తప్పట్లేదు. బంగ్లాదేశ్ చేతిలో మరోసారి చిత్తు చిత్తుగా ఓడింది. సిల్హెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో 78 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్‌ను 0-2 తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఈ మ్యాచ్‌లో 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్తాన్ 358 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది.. ఆతిథ్య జట్టుకు ఘన విజయాన్ని అందించింది.

తొలి ఇన్నింగ్ లో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ అయింది. లిట్టన్ దాస్ సెంచరీతో కదం తొక్కాడు. 126 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లల్లో ఖుర్రం షెహజాద్- 4, మహ్మద్ అబ్బాస్- 3 వికెట్లతో చెలరేగారు. బౌలర్లు రాణించినా బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్ లో 232 పరుగులకే చాప చుట్టేసింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ చేసిన 68 పరుగులే టాప్ స్కోర్. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సాజిద్ ఖాన్ 38 పరుగులతో ఆదుకోకపోతే మరింత అధ్వాన్నంగా మారేదా జట్టు పరిస్థితి.

Bangladesh Seal Series with 78-Run Win Over Pakistan as Taijul Islam Shines with Spins to a 6-Wicket

రెండో ఇన్నింగ్ లో కూడా తన దూకుడు కొనసాగించింది బంగ్లాదేశ్. ఈ ఇన్నింగ్ లో కూడా సెంచరీ నమోదైంది. ముష్ఫికుర్ రహీం 137 పరుగులు బాదాడు. అతనికి తోడుగా ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్- 52, లిట్టన్ దాస్ 69 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 390 వద్ద నిలిచింది. మొత్తంగా 437 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్ పడుతూ లేస్తూ సాగింది. జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. అజాన్ అవైస్- 21, అబ్దుల్లా ఫజల్- 6 పరుగులకు పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత కేప్టెన్ షాన్ మసూద్- 71, బాబర్ ఆజమ్- 47 పరుగులతో మూడో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక కూడా అదే పోరు కొనసాగింది. లోయర్ మిడిల్ ఆర్డర్ లో సల్మాన్ ఆఘా- 71, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 94 పరుగులతో గెలిపించే ప్రయత్నం చేశారు గానీ మిగిలిన బ్యాటర్ల నుంచి వారికి ఎటువంటి సహకారం అందలేదు. సవూద్ షకీల్- 6, సాజిద్ ఖాన్- 28 పరుగులు చేయగా.. హసన్ అలీ, ఖుర్రం షెహజాద్ డకౌట్ అయ్యారు.

దీంతో 358 పరుగుల వద్ద పాకిస్తాన్ ఇన్నింగ్ చతికిలపడింది. బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లాం.. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ఆరు వికెట్లు పడగొట్టి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. నహీద్ రానా- 2 వికెట్లు తీసుకోగా.. షొరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ ఒక్కో వికెట్ నేల కూల్చారు.

Story first published: Wednesday, May 20, 2026, 12:03 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+