T20 World Cup 2022: రాణించిన శాంటో.. 150 పరుగులు చేసిన బంగ్లాదేశ్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్యం జరగుతున్న సూపర్-12 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ శాంటో హాఫ్ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ డకౌట్ కాగా.. కెప్టెన్ షకీబుల్ హసన్ 23, హుస్సేన్ 29 పరుగులతో రాణించారు.

భారత్
జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ రెండేసి వికెట్ల పడగొట్టగా.. రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు. గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్, నెదర్లాండ్స్ విజయం సాధించింది. కాగా సౌతాఫ్రికా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించింది.

జింబాబ్వే
గ్రూప్-2లో జింబాబ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. జింబాబ్వే పాకిస్థాన్ పై గెలుపొందగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బంగ్లాదేశ్ 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ పై గెలుపొందగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఇక పాకిస్థాన్ విషయానికొస్తే ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. పాక్ ఇండియా, జింబాబ్వే చేతిలో ఓటమి పాలయింది.

రన్ రేటు
నెదర్లాండ్స్ కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. నెట్ రన్ రేటు పరంగా చూస్తే గ్రూప్-2 సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా +5 రన్ రేటుతో ఉండగా.. భారత్ +1 రన్ రేటుతో ఉంది. జింబాబ్వే తప్ప మిగతా మూడు జట్ల నెగటివ్ రన్ రేటుతో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications