Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ తోక ముడిచింది.. అఫ్ఘన్ క్రికెటర్ల నాగిని డ్యాన్స్

Bangladesh’s ‘nagin dance’, Sri Lanka’s ‘pungi’ - the celebration war in Colombo

హైదరాబాద్: ఇటీవల క్రికెట్‌లో నాగిని డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది. దీనిని సీనియర్లు క్రికెటర్లు సైతం ఇమిటేట్ చేశారంటే ఎంత ఫేమస్ అయిందో తెలుస్తోంది. విజయోత్సాహంతో ఈ సంజ్ఞను సింబాలిక్‌గా ఏర్పరచుకుంది బంగ్లాదేశ్. కాగా, పరాజయంలోనూ ప్రత్యర్థులు అదే సంజ్ఞను చేసి చూపడంతో వారికే కౌంటర్ పడినట్లయింది.

మైదానంలో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసినప్పుడు లేదా వికెట్లు దక్కించుకున్నప్పుడు ఆ ఆటగాడి ఆనందానికి అవధులుండవు. ఒక్కో ప్లేయర్ వారి శైలికి అనుగుణంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో సందడి చేస్తూ కనిపించారు.

అయితే వరుసగా మ్యాచ్‌లు గెలిచి బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్‌కు గురి చేసిన అఫ్ఘనిస్థాన్.. విజయానంతరం ఇదే పని చేయడంతో బంగ్లా ఆటగాళ్లకు నోట మాట రాలేదు. తాజాగా బంగ్లాదేశ్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ముగిసింది. 3-0తో అఫ్గాన్‌ ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగింది. ఒత్తిడిని జయించిన అఫ్గాన్‌.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఈ ఆనందంతో అఫ్గాన్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ షజాద్‌ నాగిని డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టాడు. మరి కొంతమంది ఆటగాళ్లు కూడా షజాద్‌ బాటలో నడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు 'సీన్‌ రివర్స్‌ అయ్యింది; ఇప్పుడు నాగిని డ్యాన్స్‌ వేస్తోంది అఫ్గాన్‌ ఆటగాళ్లు; వీరు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు కాదు; అఫ్గాన్‌ ఆటగాళ్లు కూడా నాగిని డ్యాన్స్‌ బాగానే వేశారు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Friday, June 8, 2018, 14:38 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+