For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా పులులు కాస్త పిల్లులు అయ్యాయి: 43కే ఔట్‌పై ట్విట్టర్‌లో జోకులు

By Nageshwara Rao
Bangladesh record their lowest Test total in 1st Test vs West Indies

హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా ఆతిథ్య వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్. 21వ శతాబ్దంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.

Bangladesh record their lowest Test total in 1st Test vs West Indies

2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, ఇప్పుడు తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది. 2013లో దక్షిణాఫ్రికాపై 45 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్‌ రికార్డును కూడా బంగ్లాదేశ్ సవరించింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన రెండో ఇన్నింగ్స్‌గా రికార్డుకెక్కింది.

1
43699

దీంతో బంగ్లాదేశ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. కీమర్ రోచ్ బౌలింగ్‌లో కేవలం 12 బంతుల్లోనే ఐదుగురు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరారు. బంగ్లా బ్సాట్స్‌మెన్ ఆడిన తీరును విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బంగ్లా టైగర్స్ కాస్తా పిల్లులు అయ్యాయంటూ ట్విట్టర్‌‌లో పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు బంగ్లాదేశ్ ఈ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుందని క్రికెట్ అభిమానులు సైతం అంచనా వేస్తున్నారు.

Story first published: Thursday, July 5, 2018, 16:22 [IST]
Other articles published on Jul 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+