యువీకి రిటైర్మెంట్ అభినందనలు: ధావన్ ట్వీట్‌ను కాపీ కొట్టిన బంగ్లా క్రికెటర్

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. యువీ వీడ్కోలు సందర్భంగా అటు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం అతడి గత రికార్డులను గుర్తు చేస్తూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా, యువీకి అభిమాని అయిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఫేస్‌బుక్ వేదికగా అభినందనలు తెలిపాడు. "థ్యాంక్యూ పాజీ.. నేను చూసిన వారిలో నువ్వొక గొప్ప ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌వి. నేనెప్పుడు నీ స్టైల్, బ్యాటింగ్ టెక్నిక్‌ను అనుసరించాలని ప్రయత్నిస్తుంటాను. నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నీ కొత్త ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను" అని శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే, సౌమ్య సర్కార్ తన పోస్టులో రాసిన వ్యాఖ్యలు అచ్చం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చేసిన ట్వీట్ మాదిరి ఉన్నాయి. కాగా, యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే శిఖర్ ధావన్ ట్వీట్ చేయగా... సౌమ్య సర్కార్ మాత్రం ఆ తర్వాతి రోజు ఫేస్‌బుక్‌లో అవే వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దీంతో ధావన్ ట్వీట్‌ను సౌమ్య సర్కార్ కాపీ కొట్టాడని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలి వన్డే: 2000 కెన్యాపై..
ఆఖరి వన్డే: 2017 వెస్టిండీస్‌పై
తొలి టెస్టు: 2003 న్యూజిలాండ్‌పై
ఆఖరి టెస్టు: 2012 ఇంగ్లాండ్‌పై
తొలి టీ20: 2007 స్కాట్లాండ్‌పై
ఆఖరి టీ20: 2017 ఇంగ్లాండ్‌పై

అవార్డులు..
2012: అర్జున అవార్డు
2014: పద్మశ్రీ

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు
2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

12 బంతుల్లో 50
2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌లోనే యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యువరాజ్ చరిత్ర సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications