Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ చ‌రిత్రాత్మ‌క విజ‌యం.. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ఫ‌స్ట్ విక్ట‌రీ

Bangladesh Historic Win Beat New zealand

మౌంట్ మాంగనూయి: ప‌సికూన బంగ్లాదేశ్ చ‌రిత్ర సృష్టించింది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ న్యూజిలాండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పైనే ఓడించి స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. రెండు ద‌శాబ్దాలుగా కివీస్‌లో ప‌ర్య‌ట‌న‌లో అంద‌ని ద్రాక్ష‌లా మారిన‌ గెలుపు నిరీక్ష‌ణ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌దించింది. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి బంగ్లాదేశ్ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌ద్వారా వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంఫియ‌న్స్‌షిప్ 2022-2023 లో సైతం మొద‌టి విజ‌యం న‌మోదు చేసి పాయింట్ల ఖాతా తెర‌చింది. అంతేకాకుండా 2022 సంవ‌త్స‌రాన్ని బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యంతో ప్రారంభించింది.

తొలి టెస్టులో ఘ‌న‌విజ‌యం

తొలి టెస్టులో ఘ‌న‌విజ‌యం

మౌంట్ మాంగనూయి వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ ఘ‌న‌విజ‌యం సాధించింది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌ను బంగ్లా 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అంతేకాకుండా న్యూజిలాండ్‌కు సొంత గ‌డ్డ‌పైనే షాకిచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ పేస‌ర్ ఎబాడోత్ హుస్సేన్ 6 వికెట్లతో చెల‌రేగాడు. 147-5తో ఐదో రోజు ఉద‌యం ఆట ప్రారంభించిన అతిథ్య‌ న్యూజిలాండ్ ఆలౌట్ కావ‌డానికి ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. బంగ్లా బౌల‌ర్ల ధాటికి ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు ఫెమిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 154 ప‌రుగుల వ‌ద్ద 40 ప‌రుగులు చేసిన రాస్ టేల‌ర్‌ను హుస్సేన్ ఔట్ చేశాడు. 160 ప‌రుగులు వ‌ద్ద జేమ్స‌న్‌ను హుస్సేన్ డ‌కౌట్ చేశాడు. ఆ త‌ర్వాత 16 ప‌రుగులు చేసిన ర‌చీన్ ర‌వీంద్ర‌ను, సౌథీని డ‌కౌట్‌గా టాస్కిన్ అహ్మ‌ద్ ఫెమిలియ‌న్ పంపాడు. చివ‌ర‌గా 8 ప‌రుగులు చేసిన బోల్ట్‌ను హుస్సేన్ ఔట్ చేయ‌డంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 169 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బంగ్లా బౌల‌ర్ల‌లో ఎబాడోత్ హుస్సేన్ 6 వికెట్లతో చెల‌రేగాడు. టాస్కిన్ 3, హాస‌న్ ఒక వికెట్ తీశారు.

సునాయ‌సంగా ల‌క్ష్య చేధ‌న‌

40 ప‌రుగులు స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సునాయ‌సంగా అందుకుంది. దీంతో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హాస‌న్ మ్యాచ్‌లో లేకున్న విజ‌యం సాధించడం గ‌మనార్హం. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసిన ఎబాడోత్ హుస్సేన్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ విజ‌యంతో బంగ్లాదేశ్ 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.

స్కోర్లు:

తొలి ఇన్నింగ్స్‌:

న్యూజిలాండ్‌- 328, బంగ్లాదేశ్‌-458

సెకండ్ ఇన్నింగ్స్‌:

న్యూజిలాండ్- 169, బంగ్లాదేశ్ 42-2.

బంగ్లాదేశ్ రికార్డులు

బంగ్లాదేశ్ రికార్డులు

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజ‌యం. 2001 నుంచి న్యూజిలాండ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ అన్నింట్లో ఓడిపోయింది. అందులో 16 టెస్టు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. టెస్టు ఫార్మాట్‌లో ఇంటా, బ‌యాటా న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే గెలుపు. గ‌తంలో త‌మ హోంగ్రౌండ్‌లో సైతం కివీస్ చేతిలో బంగ్లా ఓట‌మిపాలైంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొద‌టి 5 స్థానాల్లో ఉన్న జ‌ట్టును బంగ్లాదేశ్ ఓడించ‌డం కూడా ఇదే తొలిసారి.

WTCలో ఐదో స్థానానికి బంగ్లాదేశ్‌

WTCలో ఐదో స్థానానికి బంగ్లాదేశ్‌

ఈ విజ‌యంతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2022-2023 పాయింట్ల ప‌ట్టిక‌లో బంగ్లాదేశ్ ఖాతాలో 12 పాయింట్లు చేరారు. దీంతో ప‌ట్టిక‌లో ఆ జ‌ట్టు ఐదో స్థానానికి ఎగ‌బాకింది. ఆస్ట్రేలియా, శ్రీ‌లంక‌, పాకిస్థాన్, ఇండియా 1, 2, 3, 4 ర్యాంక‌ల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, January 5, 2022, 8:49 [IST]
Other articles published on Jan 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+