మ్యాచ్ ఆడుతుండగా మాజీ కెప్టెన్‌కు గుండెపోటు.. పరిస్థితి తీవ్ర విషమం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (36) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది. ఢాకా ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఆడుతుండగా ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.

కాసేటి గ్యాప్‌లోనే రెండు సార్లు గుండెపోటు..
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినెపుకర్ క్రికెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా టాస్ కోసం మహమ్మదన్ క్లబ్ కెప్టెన్ తమీమ్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆ సమయంలోనే అతడికి ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం కాసేపట్లోనే ఢాకాకు తమీమ్ ను తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కానీ, హెలిప్యాడ్‌కు వెళ్తుండగా మళ్లీ గుండెపోటు వచ్చింది. దీంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.
రీసెంట్ గానే ఆటకు వీడ్కోలు.. ఇద్దరు పిల్లలు..
బంగ్లా తరఫున 70 టెస్టులు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు తమీమ్. 243 వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తమీమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications